E-Paper
Advertisement

Tollywood Producer: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నిర్మాత చిట్టిబాబు మృతి.. కారణం అదే..!

Tollywood Producer: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నిర్మాత చిట్టిబాబు మృతి.. కారణం అదే..!
Advertisement

Tollywood Producer:చిత్ర పరిశ్రమలో నేడు మరో విషాదం చోటుచేసుకుంది. ఒక విషాదం మరువక ముందే మరొక విషాదం అభిమానులను, సినీ సెలబ్రిటీలను తీవ్రకలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. ఈ విషయం అటు సోషల్ మీడియాలో ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ నిర్మాత ఎవరు ? ఆయన చనిపోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిర్మాత చిట్టిబాబు కన్నుమూత.. ఎలా జరిగిందంటే?

చిత్ర పరిశ్రమలో పేరు మోసిన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న త్రిపురనేని వరప్రసాద్ అలియాస్ చిట్టిబాబు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం చిట్టిబాబు వయసు 70 సంవత్సరాలు. గుండెపోటుతో మరణించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

చిట్టిబాబు బ్యాక్ గ్రౌండ్..

Advertisement

చిట్టిబాబు విషయానికి వస్తే.. 1955 జూలై 28వ తేదీన కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించారు.. సుమారుగా 12 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన 30కి పైగా సినిమాలలో నటించారు. దివంగత నటి సౌందర్య , నటుడు ఎమ్మెస్ నారాయణలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఈయనదే. చిట్టిబాబు ఎవరో కాదు అల్లూరి సీతారామరాజు సినిమా రచయిత ప్రముఖ నిర్మాత త్రిపురనేని మహారథి కుమారుడే.. ఈయన అసలు పేరు వరప్రసాద్. చెన్నైలో చదువుకున్నారు. తండ్రి ముద్దుగా పిలుచుకునే చిట్టి పేరుతోనే అందరికీ పరిచయస్తులయ్యారు..

దర్శకుడిగా కూడా గుర్తింపు..

చిన్నప్పటినుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో అలా తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆత్రేయ, అప్పలాచార్య వంటి చిత్రాలకు రచనా శాఖలో అసిస్టెంట్ గా పనిచేసిన ఈయన సంతానం అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు . ఈయనను డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది మోహన్ బాబు. ఈ విషయాన్ని చిట్టిబాబు కూడా పలు సందర్భాలలో మీడియా ముందు వెల్లడించారు. అలా దర్శకుడిగా 12 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన కో-డైరెక్టర్ గా 49 చిత్రాలకు పనిచేశారు. నటుడిగా కూడా సత్తా చాటారు. అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు రూపొందించారు చిట్టిబాబు. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో కృష్ణ, భానుచందర్, వాణి విశ్వనాథన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ద్వారా సెకండ్ హీరోయిన్గా సౌందర్యను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీనికంటే ముందు ఆమె నటించిన మనవరాలి పెళ్లి సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఇదే సౌందర్య డెబ్యూ మూవీగా రికార్డులోకెక్కింది. ఆ తర్వాత చిట్టిబాబు దర్శకత్వంలో సౌందర్య గెలుపు అనే మరో సినిమా కూడా చేసింది.

Advertisement

also read:కన్నీళ్లు పెట్టుకున్న హేమా.. డ్రగ్స్ వ్యవహారంపై ఓపెన్ ఛాలెంజ్.. ‘బిగ్ టీవీ’తో ఏం చెప్పారంటే?

చిట్టిబాబు రాజకీయ ప్రస్థానం..

దర్శకుడు, రచయిత, నటుడు, నిర్మాత మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకుడు కూడా.. మొదట్లో జనతా పార్టీలో చేరిన ఈయన 1998లో బిజెపిలో చేరారుm పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వెంకయ్య నాయుడు , ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని వాజ్పేయి, విద్యాసాగర్ తో సహా ఎంతమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×