E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన వల్లి.. ధీరజ్, ప్రేమ రొమాన్స్.. నర్మదకు యాక్సిడెంట్..?

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన వల్లి.. ధీరజ్, ప్రేమ రొమాన్స్.. నర్మదకు యాక్సిడెంట్..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 25th: వల్లి భయపడిపోతుందని చూసిన నర్మదకు డౌట్ వస్తుంది. రాత్రంతా జాగారం చేస్తూ అలానే ఉండిపోయిన వల్లిని వేదవతి దగ్గరికి తీసుకొని వెళుతుంది. ఈరోజు చెకప్ కి వెళ్ళాలి కదా అయితే నేను మా అమ్మతో వెళ్తాను అని వల్లి ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం వినకుండా నేనే తీసుకుని వెళ్తాను అని చెప్తుంది.. శ్రీవల్లి ఎంతగా చెప్తున్న సరే నర్మద మాత్రం వినకుండా ఇవాళ ఎలాగైనా సరే నేను నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని బలవంతంగా లాక్కొని వెళ్తుంది..

భాగ్యం షాకిచ్చిన సుకన్య..

ఆనంద్ రావు తనను తాను పొగుడుకుంటూ అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు. పెళ్లయిన కొత్తల్లో నాకు జుట్టు ఎలా ఉందో తెలుసా? అని భాగ్యం జుట్టుని వెనకాల నుంచి వేసుకొని చాలా సంతోషంగా ఉంటాడు.. అయితే భాగ్యం మాత్రం ఈ వెటకరాలకు ఏమీ తక్కువ లేదు. నిజానికి నీకు పెళ్లయిన కొత్తలో అసలు జుట్టే లేదు అని నేను చాలా బాధపడ్డాను.. కానీ ఎవడోకడు కదా అని మళ్లీ నిన్నే చేసుకోవాలని చేసుకొని తప్పు చేశాను అని భాగ్యం చెప్పగానే ఆనందరావు సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. అయితే అప్పుడే సుకన్య ఫోన్ చేసి దొరికిపోయాం అంత తెలిసిపోయింది అంటూ భాగ్యం ను భయపెడుతుంది.. ఏం దొరికిపోయాము ఏం తెలిసిపోయింది సరిగ్గా చెప్పు అని భాగ్యం అడుగుతుంది.. వల్లిని చూపించడానికి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది నర్మదా.. ఒకవేళ అక్కడ డాక్టర్ చెక్ చేసి నిజం చెప్తే మన బండారం బయటపడుతుంది అని టెన్షన్ పడిపోతుంది.. ఆ మాట వినగానే భాగ్యం ఫ్యూజులు ఎగిరిపోతాయి.. ఇక సుకన్య ఈ ప్లాన్ ప్రకారం చేస్తే నర్మద నుంచి కాపాడవచ్చు అని అంటుంది.. భాగ్యం కూడా అదే బాగుంది సరే అలానే చేద్దామని అంటుంది..

సేనకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ వచ్చి ఒరేయ్ సచ్చినోడా వెళ్ళిపోతున్నావు ఏంట్రా.. నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతావా నీకు ఎంత ధైర్యం రాని అంటుంది.. నువ్వు ఎప్పుడూ ఇంత ఉదయం వెళ్ళవు కదా మరి ఎందుకు ఇప్పుడు ఇంత త్వరగా వెళ్తున్నావు. ఏమైంది అని అడిగితే ఇక మీద నుంచి నేను ఇంకా త్వరగా వెళ్తాను నిన్ను పోలీస్ని చేసేంతవరకు నేను ఆగను అని ధీరజ్ అనగానే.. ప్రేమ, ధీరజ్ దగ్గర ఉన్న డబ్బులను తీసుకోవాలని తన జేబులో చేయి పెట్టి తీసుకుంటూ ఉండగా.. అక్కడే ఉన్న సేన అలాగే విశ్వం వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతారు.. వాళ్లని చూసిన ఇంకాస్త ప్రేమని ప్రేమగా చూసుకుంటూ రొమాన్స్ చేస్తాడు.. అది చూసిన సేన రగిలిపోతాడు. ధీరజ్ చేసిన పనికి షాక్ అవుతాడు.. ఇకపోతే ప్రేమ వాళ్ళని చూసి వెనక్కి వచ్చేస్తుంది.

అయ్యో.. వల్లికి టెన్షన్..

వల్లిని నర్మదా ఎంతగా వద్దని చెప్పినా కూడా అసలు వినకుండా తీసుకొని వెళుతుంది. ఒకవేళ అక్కడ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నా బండారం బయట పెడితే నన్ను చంపేస్తారు.. దేవుడా నన్ను కాపాడడానికి నువ్వు రావా అంటూ వల్లి బండిమీద వెళుతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక నర్మదా సరిగ్గా కూర్చోలేవా అక్క ఎందుకు ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. నువ్వు హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని నర్మదా అంటుంది.. వల్లి ఈ పక్క సందులోనే మా ఇల్లు మా అమ్మ దగ్గరికి వెళ్లి ఒకసారి బాయ్ చెప్పేసి వెళ్దామని ఎంతగా అడుగుతున్న సరే నర్మద మాత్రం అసలు వినకుండా కాసేపట్లో హాస్పిటల్ కి వెళ్లి తర్వాత వచ్చేటప్పుడు మీ అమ్మని చూసి రావచ్చులే అని అంటుంది.. అయితే నర్మదా ఇంక నా మాట వినదు నా బండారం బయటపడుతుందేమో అని కంగారు పడిపోతుంది.

సుకన్య ప్లాన్ అదుర్స్..

Advertisement

సుకన్య ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తుతుంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అని సుకన్య ఆటో డ్రైవర్ గా వీళ్ళకి యాక్సిడెంట్ చేయాలి అని చాలా వేగంగా వచ్చి నర్మద బండిని గుద్దేస్తుంది.. అయితే ఈ ఆక్సిడెంట్ లో కింద పడిపోతుంది శ్రీవల్లి. నర్మదకు మాత్రం చిన్న గాయాలు తగులుతాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద కనిపించిన వల్లి ఒక్కసారిగా కళ్ళు తెరిచి షాక్ అవుతుంది.. ఏమైంది నేనెక్కడున్నాను అమ్మ నాన్న సుకన్య నువ్వు కూడా చచ్చిపోయి స్వర్గానికి వచ్చావా..? ఇంకా చచ్చి పోలేదా అని శ్రీవల్లి అంటుంది. నువ్వేమీ చచ్చిపోలేదే హాస్పిటల్లో పడ్డావు అని అనగానే వల్లి ఏంటి నేను హాస్పిటల్ లో ఉన్నాను హమ్మయ్య చచ్చిపోలేదా అని అంటుంది.

వల్లి నాటకం సక్సెస్..

ఇక నర్మదను చూడడానికి వేదవతి ధీరజ్ ప్రేమ అందరూ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకే నర్మదా నీకు ఇంత గాయాలు అయ్యాయా.. నీకే ఇంత గాయాలు అయితే బల్లి పరిస్థితి ఎలా ఉందో అసలది కాస్త బొద్దుగా ఉంటుంది కదా అని వేదవతి కంగారు పడిపోతుంది. లోపలికి వెళ్ళగానే అందరూ వాళ్ళ నాటకంనీ మొదలు పెడతారు.. ఈ యాక్సిడెంట్ వల్ల శ్రీవల్లి కడుపు పోయింది అని కంగారు పడిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nuvvu leka Nenu lenu Radha : ‘ నువ్వు లేక నేను ‘ రాధ ఏం చదివిందో తెలుసా..?

Karthika Deepam2 : ‘కార్తీక దీపం 2’ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. జ్యో అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి దొరికిపోయిందా..? బాలు దెబ్బ అదుర్స్.. చింతామణి ప్లాన్ ఇదా..?

Podarillu Today Episode : కేశవ, శైలు పెళ్లి ఫిక్స్..? కారేశ్వర్ ను కొట్టిన చక్రీ.. కన్నా కోసం మహా వస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ కౌంటర్.. కడుపుమంటతో రగిలిపోయిన పల్లవి.. శ్రీయా కడుపు పోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు వల్లి ఫ్యూజుల్ అవుట్.. చెంప పగలగొట్టిన వేదవతి.. ఫ్లాన్ సక్సెస్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Kissik Talks: పెళ్లిపై రేఖ షాకింగ్ కామెంట్.. కాబోయే భర్తకు అలాంటి లక్షణాలు ఉండాలంటూ!

Big Stories

Advertisement
×