E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: బాలరాజు చేత శివనారాయణకు నిజం చెప్పించిన కార్తీక్

Karthika Deepam 2 Serial Today Episode June 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: బాలరాజు చేత శివనారాయణకు నిజం చెప్పించిన కార్తీక్
Advertisement

Karthika Deepam 2 serial today Episode: కొత్త సీఈవో ప్రకటన జరుగుతుందని కొద్దిసేపట్లో శివనారాయణ వచ్చి కొత్త సీఈవోను అనౌన్స్‌ చేస్తారని బోర్డు మెంబర్స్‌ అందరూ ఎదురుచూస్తుంటారు. ఆఫీస్‌ బాయ్‌ శివనారాయణ దగ్గరకు వెళ్లి బోర్డు మెంబర్స్‌ అందరూ వచ్చారని చెప్తాడు. దీంతో శివనారాయణ తన చాంబర్‌ నుంచి మీటింగ్‌ హాల్లోకి వెళ్తుంటే కార్తీక్‌ ఎదురు వెళ్తాడు. శివనారాయణ కార్తీక్‌ను కూడా మీటింగ్‌ హాల్లోకి రమ్మని చెప్తాడు. కార్తీక్‌ మాత్రం కొద్దిసేపు ఇక్కడే ఆగండి సార్‌ మిమ్మల్ని ఒక వర్థమాన నటుడు కలుస్తాడని చెప్పి బయటకు వెళ్లిపోతాడు.

కార్తీక్‌ వెళ్లగానే శివనారాయణ దగ్గరకు పారిజాతం వస్తుంది. నువ్వెందుకు వచ్చావని శివనారాయణ అడిగితే సీఈవో ఎవరనేది ప్రత్యక్షంగా చూద్దామని వచ్చానంటుంది.  అప్పుడే అక్కడకు వచ్చిన జ్యోత్స్న కూడా నేను నీకు ఫోన్‌ లో చెప్తాను అన్నాను కదా గ్రాణి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తుంది. దీంతో పారిజాతం డైరెక్టుగా వింటే వచ్చే మజా ఫోన్‌లో రాఉద కదా అంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న, శివనారాయణను మీటింగ్‌ హాల్లోకి వెళ్దాం పద తాత అనగానే.. కార్తీక్‌ ఎవరినో తీసుకొస్తానని వెయిట్‌ చేయమన్నాడు అందుకే ఆగాను అంటూ శివనారాయణ చెప్పగానే.. జ్యోత్స్న అనుమానపడుతుంది. బావ ఎవరిని తీసుకొస్తున్నాడు అని ఎదురుచూస్తుంది.

Advertisement

కార్తీక్‌ రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లి బాలరాజును లోపలికి రమ్మని చెప్తాడు. ఇప్పుడు ఒక డెమో షూట్‌ చేస్తున్నామని.. మీకు కనిపించకుండా కెమెరాలు షూట్‌ చేస్తుంటాయని.. చెప్పి బాలరాజు కళ్లకు గంతలు కట్టి కంటెంట్‌ ఏంటంటే..  నువ్వు రెస్టారెంట్‌ కు వెళ్లి వెయ్యి భోజనాలు ఆర్డర్‌ చేయాలి. ఇరవై లక్షల పేమెంట్‌ పది లక్షలు అడ్వాన్స్‌ అంటూ యాక్ట్‌ చేయాలి అని చెప్పి శివనారాయణ ముందుకు తీసుకెళ్లి యాక్షన్‌ చేయమని చెప్తాడు. బాలరాజును చూసిన జ్యోత్స్న షాక అవుతుంది. వీడు బావకు ఎలా దొరికాడు.. వీళ్లకు నిజం తెలిసిపోయినట్టు ఉంది అని మనసులో భయపడుతుంది. బాలరాజు తన యాక్టింగ్‌ మొదలు పెట్టగానే.. శివనారాయణ కార్తీక్‌కు సైగ చేస్తాడు. కార్తీక్‌ కూడా అవునన్నట్టు సైగ చేస్తాడు. శివనారాయణ కోపంగా బాలరాజు కొడతాడు. దీంతో బాలరాజు కళ్లకు గంతలు తీసేసి చూసి షాక్‌ అవుతాడు. శివనారాయణ, కార్తీక్‌ కోపంగా కొట్టగానే.. బాలరాజు జరిగింది మొత్త చెప్పేస్తాడు. తనతో ఆ నాటకం ఆడించిందని పారిజాతం అని చెప్పగానే.. శివనారాయణ కోపంగా బాలరాజును తిట్టి పంపిచేస్తాడు.

శివనారాయణ కోపంగా పారిజాతాన్ని తిడుతుంటే.. జ్యోత్న్స ఎలాగైనా శివనారాయణను డైవర్ట్‌ చేయాలని తానే పారిజాతాన్ని తిడుతుంది. పారిజాతం అయోమయంగా చూస్తూంటే.. జ్యోత్స్న కనుసైగ చేస్తుంది. పారిజాతం మౌనంగా ఉంటుంది. అసలు ఆ ఆర్డర్‌ నేను తీసుకుని ఉండి ఉంటే.. నేను నిండా మునిగిపోయి ఉండేదాన్ని కదా అంటూ తిడుతుంటే.. నవ్వేమి మునిగిపోవులే పెద్ద మేడం గారు.. అనగానే.. ఒకవేళ నిజంగా నేను ఆర్డర్‌ తీసుకుని ఉంటే మునిగిపోయే దాన్ని కదా అంటుంది. వాడెంత ఇచ్చినా నువ్వు ఆర్డర్‌ తీసుకునేదానివి కాదు ఎందుకంటే ఆ బాలరాజు గాణ్ని పారు చేత పురమాయించిందే నువ్వు కాబట్టి అంటూ కార్తీక్‌ చెప్పగానే.. జ్యోత్స్న తిడుతుంది. నా మీద నిందలు వేయకు బావ అంటూ జ్యోత్స్న అనగానే.. కార్తీక్‌ కాల్‌ రికార్డ్‌ తీసి వినిపిస్తాడు. అది విని అందరూ షాక్‌ అవుతారు. ఇక కార్తీక్‌ తాత నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పగానే..

Advertisement

సూరజ్‌ కల్పించుకుని చైర్మన్‌ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ నేను ఉండను అని చెప్తాడు. దీప ఎందుకు వెళ్తావు సూరజ్‌ అంటూ అడగ్గానే.. సూరజ్‌ మీరు కూడా వెళ్లండి దీప గారు. ఎందుకంటే చైర్మన్‌ గారి మనవరాలే తప్పు చేస్తే.. ఇక ఎలా అంటూ అందుకే మీరు వెళ్లిపోండి ఇలాంటి వ్యక్తులతో కలిసి ఎలా పని చేయగలం అంటూ చెప్పి సూరజ్‌ వెళ్లిపోతుంటే.. శివనారాయణ ఆపేసి తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి.. కానీ నిజాయితీగా పని చేసేవాళ్లకు కాదు బోర్డు మీటింగ్‌ కంప్లీట్‌ అయ్యాక మాట్లాడదాం అంటూ అందరినీ తీసుకుని మీటింగ్‌ హల్లోకి వెళ్తాడు. హాల్లో అందరి ముందు శివనారాయణ సీఈవోను ప్రకటిస్తుంటే.. జ్యోత్స్న అడ్డుపడి.. కొత్త సీఈవో దీప అంటూ ప్రకటిస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×