E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశీల స్నేహితులు.. గోపాలంతో ప్రేమ.. బాలుకు సుశీల గిఫ్ట్..

Gundeninda GudiGantalu Today episode: జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశీల స్నేహితులు.. గోపాలంతో ప్రేమ.. బాలుకు సుశీల గిఫ్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. అప్పటివరకు అందరూ ఇచ్చిన గిఫ్ట్ లతో పోలిస్తే బాలు చివరగా వచ్చి చిన్న గిఫ్ట్ కి సుశీల సంతోష పడడమే కాదు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. తన స్నేహితులతో కలిసి తిరిగిన ఊరిని పాఠశాలని, వాళ్ల నలుగురు కలిసి చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. గతంలో ఎన్నడు లేని విధంగా సుశీల సంతోషంగా ఉండడం చేసిన సత్యం మా అమ్మ సంతోషాన్ని కారణమైన బాలుకి థాంక్స్ చెప్పాల్సిందే అని అంటాడు. అసలు వీళ్ళ గురించి నీకు ఎవరు చెప్పారు రా అని సుశీల బాలుని అడుగుతుంది. మీనా చెప్పింది అని బాలు. పొద్దున మీరు చెప్పినప్పుడు నేను వీడియో తీసాను కదా అది ఆయనకు పంపించాను. మీ కోరికను ఎలాగైనా తీర్చాలని ఆయన ఇంత కష్టపడ్డాడు ఇంత ఆలస్యంగా వచ్చాడు అని మీనా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు బామ్మ చివరి కోరికను నెరవేర్చి పుట్టినరోజు నాడు ఎవరు ఊహించలేని విధంగా గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటుంది. బామ్మ స్నేహితురాలైన సత్య కూడా ఎవరు ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఇస్తుంది. బామ్మ లవర్ గోపాలం ను బర్త్డే పార్టీకి తీసుకువస్తుంది.. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని సుశీల ఫ్రెండ్ సత్య బయటపెట్టేస్తుంది. ఈ వయసులో ప్రేమ వ్యవహారాన్ని గుర్తు చేసుకొని సిగ్గు పడుతుంది.. ఆమె సిగ్గు పడటం చూసి అందరు నవ్వుతారు.. వీళ్ళ ఇద్దరిని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా మీ వయసులో కూడా మీరు ఇంతగా మెలికలు తిరుగుతున్నారా అని అంటారు..

Advertisement

మనందరం ఇలా కలుసుకోవాలని నువ్వు మా గురించి తలుచుకొని చాలా బాధపడుతున్నావని నీ మనవడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి తీసుకొని వచ్చాడు. నీకోసమేమీ రాలేదు నీ మనవడు చాలా కష్టపడి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి వచ్చాము అని అందరూ అంటారు. అంటే మీరందరూ నాకోసం రాలేదన్నమాట అని అనగానే ఊరుకోవే సరదాగా అన్నామని ముగ్గురు స్నేహితులు కలిసి ఆట పట్టిస్తారు. మొత్తానికి సుశీల కోరికను బాలు తన పుట్టినరోజు నాడు తీర్చడంతో చాలా సంతోషంగా ఉంటుంది. బామ్మ సంతోషాన్ని చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషపడతారు.. ఇక అందరూ కలిసి సుశీల పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా చేస్తారు.

ప్రభావతి మాత్రం ఇది ఈ వయసులో ఈ సిగ్గేంటి ఇదేంటి అని అంటుంది. కేక్ కట్టింగ్ టైం అయింది పదండి కేక్ కట్ చేద్దాం అని రవి అంటాడు.. అందరు కూడా పద ముందు కేక్ కట్ చేసి ఆ తర్వాత మళ్లీ కాసేపు సరదాగా మాటలు మాట్లాడుకుందామని సుశీల ఫ్రెండ్స్ అంటారు. తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని కలుసుకున్న ఆనందంలో సుశీల చాలా సంతోషంగా కేక్ కట్ చేయడానికి వెళుతుంది. సత్యం ను పిలిచి ముందుగా కేకును పెడుతుంది. అలాగే ప్రభావతి ని తన స్నేహితుల ముందు పొగిడేస్తుంది. ఇక ప్రభావతి ఆనందానికి అవధులు ఉండవు.. బాలు, మీనాకు కేక్ పెడుతుంది. అందరు చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

Also Read : పెళ్లి నరకం.. కన్నీళ్లు తెప్పిస్తున్న శిరీష స్టోరీ.. ఒక్కరోజుకు ఎంతంటే..?

కేకు కట్ చేసి అందరికీ పెట్టిన తర్వాత అత్తయ్య గారు మీరు ఇప్పుడు కేక్ కట్ చేసేసారు కదా పుట్టినరోజు వేడుకలు అయిపోయాయి కదా ఆ గిఫ్ట్ మీరు ఎవరికి ఇస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంది. నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన బాలుకే నేను ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అంటుంది. నా చిన్ననాటి స్నేహితులందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాడు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కారణం వాడే ఇది బాలు మీనాకే చెందుతుంది అని ఒక నెక్లెస్ బాక్స్ ఇస్తుంది.. తరాలుగా వస్తున్నా కుటుంబ మర్యాద.. అందుకే ఇది చాలా స్పెషల్ అని అన్నాను. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లిళ్లు చేసుకునే విడిపోయిన నా స్నేహితులని మళ్ళీ నాకు దగ్గర చేసిన బాలుగే గిఫ్ట్ చెందుతుంది అని సుశీల అంటుంది. నేనేం చేస్తాను మామ నీ ఫ్రెండ్స్ ని నీకు దగ్గర అంతే కదా అంటే లేదురా నువ్వు నాకు ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేశావని సుశీల ఆ గిఫ్ట్ ని బాలుకు ఇస్తుంది.. ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×