E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 17th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ చేతిలో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు  

Brahmamudi Serial Today November 17th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ చేతిలో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు  
Advertisement

Brahmamudi serial today Episode:  

రాహుల్‌ తీసుకొచ్చిన చీర కట్టుకుని స్వప్న కిందకు వస్తుంది అది చూసిన ధాన్యక్ష్మీ స్వప్న ఏంటా చీర అని అడుగుతుంది. దీంతో స్వప్న చీరే ఎందుకు..? అని అడగ్గానే.. చీర సరే అంత నాసిరకమైన చీర నువ్వు ఎప్పుడూ కట్టవు కదా..? అలాంటి చీర కట్టావు చూడ్డానికి అసహ్యంగా ఉంది తెలుసా.? అని ధాన్యం చెప్పగానే.. నాకు బాగుంది అని స్వప్న చెప్తుంది. దీంతో ధాన్యం నీకు బాగుండటం కాదు స్వప్న బయటి వాళ్లు ఎవరైనా చూస్తే మాకు బాగోదు అంటుంది ధాన్యలక్ష్మీ.. దీంతో స్వప్న ఈ చీర రాహుల్‌ నా కోసం తెచ్చిన చీర అని చెప్తుంది దీంతో ఇంద్రాదేవి ఆశ్చర్యంగా ఏంటి వాడు నీకోసం చీర తెచ్చాడా..? అని అడుగుతుంది.

స్వప్న అవును అని చెప్పగానే.. తెస్తే తెచ్చాడు కానీ ఈ నాలుగు  వందల రూపాయల చీర నెవ్వెలా కట్టుకున్నావు స్వప్న అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. నేను చీర ఖరీదు గురించి ఆలోచించలేదు నా భర్త నా కోసం తన కష్టార్జీతంతో తెచ్చిన చీర ఇది నాకు చాలా గొప్పది అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ ఏంటో నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎలా ఆలోచిస్తావో  ఎవ్వరికీ అర్థం కాదు అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో రాహుల్ వచ్చి స్వప్న నేను నీకు ముందే చెప్పాను కదా ఈ చీర నీకు తగదు అని ఇలాంటి సమస్య వస్తుందని ముందే చెప్పాను వెళ్లు వెళ్లి ఈ చీర మార్చుకో అని చెప్పగానే.. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ఈ చీర నేను మార్చుకోను నిన్ను డిస్సపాయింట్ చేయను అంటుంది. ఇంతలో అప్పు కూడా ఉండనీలే అత్తయ్య అక్కకు ఈ చీర బాగానే ఉంది అని చెప్పగానే ఇంతలో రాజ్‌, కావ్య వస్తారు.. రాజ్‌ తన జేబులోంచి చెక్ తీసి రాహుల్‌ ఈరోజు టెండర్‌ ఉంది. నువ్వు బ్యాంకుకు వెళ్లి ఇరవై లక్షలు తీసుకుని టెంబర్‌ ఆఫీసుకు వెళ్లు  అంటూ చెక్‌ ఇవ్వగానే..

Advertisement

రాహుల్‌ అనుమానంగా నేను బ్యాంకు కు అది కూడా ఇరవై లక్షల  క్యాష్‌ విత్ డ్రా చేయడానికా..? అన అడగ్గానే.. ఎన్నాళ్లని ఖాళీగా ఉంటావురా.. ముందు ఇలాంటి చిన్న చిన్న పనులు చూడు అని చెప్పగానే.. సుభాష్‌ కల్పించుకుని రాజ్‌ ఏంటిది ఆఫీసు పనులు వాడు చూసేది ఏంటి.? అయినా ఇరవై లక్షల క్యాష్‌ తీసుకురమ్మని వాడికి చెప్తున్నావు ఎందుకు అలా అని అడగ్గానే.. టెండర్‌ టైంకి డబ్బు కట్టాలి కదా నాన్న అని చెప్పగానే.. అందుకు బాబాయ్‌ ఉన్నాడు కదా అని చెప్పగానే.. బాబాయ్‌ గంట ముందే టెండర్‌ ఆఫీసు దగ్గర ఉండాలి. ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలి కదా ఈ లోపు రాహుల్ పని పూర్తి చేసుకుని వెళ్తాడు.. అని చెప్పగానే.. అదే దానికి రాహులే ఎందుకు అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. రాహులే చేయాలి పిన్ని అంటూ రాజ్‌ చెప్పగానే.. రాజ్‌ ఇంత బాధ్యతను నన్ను నమ్మి నాకు అప్పగిస్తున్నావా..? థాంక్యూ రాజ్‌ అని చెప్పగానే. నేను కూడా అంత ధైర్యం చేయలేను రాహుల్‌ కానీ ప్రతి మనిషిని నమ్మి ఒక అవకాశం ఇవ్వాలి కదా ఆ అవకాశమే నీకు ఇమ్మని కళావతి చెప్పింది. అనగానే కావ్య కూడా మీరు ఎవ్వరూ భయపడకండి రాహుల్‌ తన పని తాను కరెక్టుగా చేస్తాడు అని చెప్తుంది. రాహుల్‌ ఈ టెండర్‌మనకు చాలా ఇంపార్టెంట్‌ కరెక్టు పదకొండు గంటలకు బాబాయ్‌ కు డబ్బులు ఇవ్వాలి అని చెప్పగానే.. థాంక్యూ రాజ్‌.. నేను నీ నమ్మకాన్ని నిలబెడతాను అంటూ రాహుల్‌ బ్యాంకుకు వెళ్తాడు.

తర్వాత కావ్య దగ్గరకు వెళ్లిన స్వప్న ఎమోషనల్‌ అవుతూ.. రాహుల్‌కు ఈ చాన్స్‌ ఇచ్చినందుకు చాలా థాంక్యూ అని చెప్తుంది. దీంతో మనిద్దరి మధ్య ఈ థాంక్స్‌ ఏంటి అక్కా అంటూ కావ్య చెప్తుంది.  మరోవైపు బ్యాంకు నుంచి క్యాష్‌ తీసుకుని బయటకు వచ్చిన రాహుల్‌ చేతిలోంచి సూట్‌ కేసు లాక్కుని పారిపోతారు. తోపులాటలో కింద పడిపోయిన రాహుల్‌ ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. మరోవైపు ప్రకాష్‌, రాజ్‌కు కాల్‌ చేసి రాహుల్‌ టెండర్‌ ఆఫీసుకు రాలేదని చెప్తాడు. విషయం తెలిసిన ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. అందరూ రాహుల్‌ను తిడతారు. స్వప్న బాధపడుతుంది. ఇంతలో రాహుల్ దెబ్బలతో ఇంటికి వస్తాడు. రాహుల్‌ ను చూసిన అందరూ షాక్‌ అవుతారు. ఏం జరిగింది ఈ దెబ్బలు ఏంటి..? అని అడుగుతారు.. దీంతో రాహుల్ బ్యాంకు ముందు ఎవరో దొంగలు అటాక్‌ చేసి నన్ను కొట్టి డబ్బు తీసుకెళ్లారు. అతి కష్టం మీద వాళ్లను పట్టుకుని డబ్బు తీసుకొచ్చాను. అని రాహుల్‌ చెప్పగానే.. ఇదేదో కొత్త నాటకం లాగా ఉంది అని ధాన్యలక్ష్మీ అనగానే.. ఇంతలో సుభాష్‌ వచ్చి రాహుల్‌ చెప్పింది నిజమే అంటూ జరిగింది తాను చూశానని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×