E-Paper
Advertisement

Congo: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన

Congo: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన
Advertisement

Congo: ఆఫ్రికా కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి దాదాపు 32 మంది చనిపోయారు.  వందల మంది గాయాలతో పోరాడుతున్నారు. దీంతో 70 వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.

లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ప్రమాదం
లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ మైనింగ్‌ సైట్‌లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. మైనింగ్‌ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.

Advertisement

Also Read: రామోజీరావు చెప్పిన ఆ మాటలు మర్చిపోలేను.. ‘రామోజీ అవార్డ్స్’లో CM రేవంత్ రెడ్డి

రాగి మైనింగ్ పై లక్షల మంది ఉపాధి..
కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్‌ ముఖ్యమైన జీవనాధారం. ఇక్కడ కనీసం 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఇంత మంది ఉపాధి పొందుతున్న ఈ గనిలో కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృతిచెందారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×