E-Paper
Advertisement

Family Drama OTT: ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఏడిపించే స్టోరీ… బంధాలను గుర్తు చేస్తూ… 8.4 రేటింగ్ కూడా

Family Drama OTT: ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఏడిపించే స్టోరీ… బంధాలను గుర్తు చేస్తూ… 8.4 రేటింగ్ కూడా
Advertisement

Family Drama OTT : ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు ఆసక్తిగా ఉంటాయి. చుట్టాలు, మిత్రులు, ఆస్తులు, గొడవలు, ఏడుపులు ఇవన్నీ కలిపి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ ఇస్తుంటాయి ఈ సినిమాలు. అంతేకాకుండా ఫ్యామిలీ ఎలా ఉండకూడదు, ఎలా ఉండొచ్చు అనే అంశాలను కూడా చూపిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఇవన్నీ దొరుకుతాయి. ఏళ్ల తరబడి విడిపోయిన సోదరులు మళ్ళీ ఎలా కలిశారు ? అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

ఈ తమిళ కుటుంబ కథా చిత్రం పేరు ‘వీరాయి మక్కల్’ (Veerayi Makkal). 2024లో విడుదలైన ఈ సినిమా, తెలుగులో ‘వీరమ్మ ప్రజలు’ పేరుతో డబ్ చేయబడింది. నాగరాజ్ కరుప్పయ్య ఈ చిత్రానికి కథ, మాటలు అందించి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా సురేష్ నంద, హీరోయిన్‌గా నందన ఆనంద్  నటించారు. వేల రామమూర్తి, జి. మరిముత్తు, దీపా శంకర్, రమ కీలక పాత్రలు పోషించారు. ఇక హీరోగా నటించిన సురేష్ నందనే స్వయంగా ‘ఏ వైట్ స్క్రీన్ ఫిల్మ్స్’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒకే కడుపున పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. చిన్నప్పుడు అమ్మానాన్నలు చనిపోతే, ఒకరికొకరు తోడుగా ఉండి పెరిగారు. కానీ పెద్దయ్యాక ఆస్తుల గొడవలు, చిన్న చిన్న మాట పట్టింపులతో ఒకరి మొహం ఒకరు చూసుకోనంతగా విడిపోతారు. దాదాపు ఇరవై ఏళ్లు గడిచినా, పక్క పక్క ఊర్లలోనే ఉన్నా పలకరించుకోరు. పగతో రగిలిపోతూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటూ ఉంటారు.

ఇలాంటి టైంలో వీళ్ల కుటుంబంలో ఒక పెద్ద చావు జరుగుతుంది. ఆ చావు దగ్గరైనా అందరూ కలిసి పాత గొడవలు మర్చిపోతారేమో అని చుట్టుపక్కల వాళ్లంతా ఎదురుచూస్తారు. కానీ అక్కడికి వచ్చాక కూడా పాత కక్షలు బయటపడి రచ్చ రచ్చ అవుతుంది. వీళ్ళ మధ్య అసలు ఏం జరిగిందనే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు? ఆ గొడవల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ ఫ్యామిలీ మళ్లీ ఒక్కటి అవుతుందా ? అనే విషయాలను , ఈ సినిమాను చూసి తలుసుకోండి.

Advertisement

Read Also : టీచర్ ను లైన్ లో పెట్టే స్టూడెంట్… రివేంజ్ అంటూ తపిస్తూనే… ఇదో రకం ప్రేమ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×