// // Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. సాధించిన మీనా.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. సాధించిన మీనా.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 18th : అందరూ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ప్రభావతి తన ప్లాన్ ని పక్కాగా చేయాలి అని అనుకుంటుంది. సడన్గా తనకి చెయ్యి నొప్పి వచ్చేసింది అని బాధపడిపోయినట్లు నటిస్తుంది.. అప్పుడప్పుడు నా చెయ్యి ఇలానే వాపు లాగా వచ్చేసి ఇబ్బంది పెడుతుంది నేను ఏ పని చేసుకోలేను ఇవాళ నువ్వు దగ్గర ఉండి నాకు అన్ని పనులు చేయాలి అని మీనా అని అంటుంది. కానీ మీనా డెకరేషన్ పనులు చేయడానికి టైం అయిపోతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. బాలు ఫోన్ చేసి నేను ఎక్కడున్నావని అడుగుతాడు. అయితే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా ఇక్కడ డెకరేషన్ పనులు ఎవరు చేస్తారు అని బాలు అడుగుతాడు. మీ అమ్మకి సడన్గా చెయ్యి నొప్పి వచ్చింది వాపు వచ్చిందట. ఆవిడ ఇబ్బంది పడిపోతుంది అని బాలుకి చెప్పడంతో మా అమ్మకి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ లేదే ఇదేంటి కొత్తగా అని అంటాడు. ఇక డెకరేషన్ నీ వీడియో కాల్ చేసి చూడమని చెప్తాడు బాలు. మొత్తానికి దగ్గరుండి బాలు డెకరేషన్ పనులు చూసుకుంటూ ఉంటాడు.. ఇక ప్రభావతి మాత్రం మీనని ఆడుకుంటూ ఉంటుంది..

రికార్డు బ్రేక్ చేసిన మీనా..

ప్రభావతి నాకు ఆకలిస్తుంది అది కావాలి ఇది కావాలి అని కోరికలను కోరుతుంది. అయితే మీనా ఎంతో ఓపికగా కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. ఒకవైపు ఇంట్లో పని చేస్తూనే మరోవైపు తన డెకరేషన్ పనులను దగ్గర ఉండి చూసుకుంటుంది.. వీడియో కాల్ చేసి అక్కడ డెకరేషన్ పూర్తి చేస్తుంది.. అయితే డెకరేషన్ పూర్తయింది అని అది చూసిన మీనా చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఇంత మంచి ఆర్డర్ వచ్చింది కానీ నేను వెళ్ళలేకపోయినా సరే పూర్తి చేశాను అని నేను సంతోషంగా ఉంటుంది. బాలు కూడా డెకరేషన్ చాలా బాగా వచ్చిందని మేనేజర్ చాలా మెచ్చుకున్నారు. నువ్వు సక్సెస్ అయేనా అని చెప్పగానే నేను చాలా సంతోషంగా ఉంటుంది. నేను సక్సెస్ అవ్వడం కాదు. మీరందరూ చాలా కష్టపడి చేశారు మీరు చేసినంత వల్లే నేను ఈ ఆర్డర్ చేశానని మీనా అంటుంది.

చింతామణికి షాక్..

Advertisement

ప్రభావతికి చింతామణి ఫోన్ చేస్తుంది. చింతామణి నా మీనా ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచాను అని అనగానే.. ఏంటి లాభం ఆల్రెడీ డెకరేషన్ ని పూర్తి చేసింది.. అది ఎలా సాధ్యం.. ఇంట్లోనే ఉండి నాకు అన్ని చేసిపెడుతుంది కదా.. అది వీడియో కాల్ చేసి మొత్తం డెకరేషన్ పనులన్నీ చూసుకుంది. ఇది నాకు తెలిసి ఉంటే నేను తన్ని నా కళ్ళ ముందర కూర్చోబెట్టుకునే దానికదా అని ప్రభావతి అంటుంది. మీరు మొత్తానికి నా నోట్లో మట్టి కొట్టారు అని ప్రభావతి పై చింతామణి సీరియస్ అవుతుంది. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు నేను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చో పెట్టాను.. కానీ దానికి ఎంత తెలివి ఉందని నేను అసలు ఆలోచించలేదు అని ప్రభావతి అంటుంది..

రవి కోసం శృతి ప్లాన్..

రెస్టారెంట్లో నీతూ తనకి కాలు బాగోలేదని అసిస్టెంట్గా వేరే వాళ్ళని పెట్టుకోవాలని అనుకుంటుంది.. అక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువగా శాలరీ డిమాండ్ చేయడంతో నీతూ తనకి మంచి అసిస్టెంట్ దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తుంది.. కానీ చివరికి శృతి నీతూకి షాక్ ఇచ్చింది.. నేను ఇక్కడ రవి కోసమే పార్ట్ టైం జాబ్ చేస్తాను అని అనడంతో నీతూ వాళ్ళ ప్రేమ మధ్యలో ఈ జాబు వారధిగా పని చేస్తుందని ఆలోచిస్తుంది.. భర్తతో కలిసి ఉండాలని శృతి కోరికను నీతూ తీరుస్తుంది.. ఇక రవి శృతి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా నీతూ చెప్పిన సమాధానం విని షాక్ అవుతాడు.. మొత్తానికి రవి కోసం వేసిన ప్లాను సక్సెస్ అవుతుంది..

ప్రభావతికి సన్మానం..

Advertisement

బాలు ప్రభావతి ఎక్కడ పోలావతి ఎక్కడ అంటూ హడావిడి చేస్తూ ఇంటికి వస్తాడు.. ఏమైందిరా ఎందుకు చెవి కోసం మేకలాగా అలా అరుస్తున్నావు అని ప్రభావతి అంటుంది.. అయితే ప్రభావతి చేసిన పనికి సన్మానం చేయాలి అని బాలు అందరితో అంటాడు. అంత గొప్ప ఘనకార్యం ఏం చేస్తుందని ఆమెకి ఇప్పుడు సన్మానం చేయాలి అని అందరూ అంటారు. ఎందుకు చేశారు ఆ పని అని మేన అనడంతో నేనేం చేశాను అని ప్రభావతి అంటుంది. నా జీవితంతో ఎలా ఆడుకోవాలని చూశారో నాకు అర్థం అయిపోయింది. మీరు ఎందుకు నన్ను డెకరేషన్ కి పంపివ్వలేదు అని నేను అడుగుతుంది. మీనా నేను ఎంతో కష్టపడి అందరికీ వంట చేసి పెట్టి నాలుగు రూపాయలు సంపాదించాలని వెళ్లాలి అనుకుంటే మీరు ఎందుకు నన్ను ఆపారు అని బాధ పడిపోతుంది. మీనా చెప్పింది విని సత్యం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.

ప్రభాకు సత్యం వార్నింగ్..

ఏంటి ప్రభా నువ్వు చేసింది కోడలు ఎదగాలని అనుకుంటే నువ్వు ఎందుకు తనని ఆపాలని అనుకుంటున్నావో తను నిన్ను ఎంతగా చూసుకుంటుందో నీకు తెలియదా.? ఇవాళ నాటకం ఆడి మీనాని ఆపావు.. అదే రేపు కాలు చేయి పడిపోతే నేను చూసే దిక్కు కూడా లేరు అని ప్రభావతిని తిడతాడు సత్యం.. కానీ నాన్న ఈవిడ వల్ల మీనాకి మంచే జరిగింది. ఎవరైనా కోడలు ఎదుగుతుంది అంటే సంతోషిస్తారు కానీ ఈవిడ మాత్రం ఈ కోడలు ఎదుగుతుంది అంటే మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని బాలు దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. ఏది ఏమైనా కూడా మీనా కి మంచే జరిగింది. మరో నాలుగు డెకరేషన్ ఆర్డర్లు వచ్చాయి అని చెప్పగానే సత్యం సంతోషపడతాడు.. మీనా ఇక మీదట నుంచి ఎటువంటి పని ఇంట్లో చేయదు ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు చేసుకోవాలి అని అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు బాలు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కోడలి కోరిక తీర్చిన రామరాజు.. ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. రైస్ మిల్లులో దొంగతనం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×