E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీతో పెళ్లి గురించి నిజం చెప్పిన రాజు  

Brahmamudi Serial Today Episode June 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీతో పెళ్లి గురించి నిజం చెప్పిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: వెంకట్‌ కాళ్లను చూసి చలపతి, లక్ష్మీ ఎమోషనల్ అవుతుంటారు. లక్ష్మీ వెన్నపూస తీసుకొచ్చి వెంకట్‌ పాదాలకు పూస్తూ.. ఆ దేవుడు నిన్ను ఎప్పుడు కరుణిస్తాడో అనగానే.. నేను త్వరలోనే మంచి జాబ్‌ సంపాదించి బెటర్‌ పొజిషన్‌కు వెళ్తాను అనగానే.. అంటే ఇప్పుడు చేస్తుంది మంచి జాబ్‌ కాదా అనగానే.. వెంకట్‌ షాక్‌ అవుతూ.. అదేం లేదు.. కానీ ఏఐ నేర్చుకుంటున్నాను కదా..? ఇంతకంటే మంచి జాబ్‌ వస్తుంది అని చెప్పాను అంటూ తనకు నిద్ర వస్తుందని ఇంట్లోకి వెళ్లిపోతాడు.

రాజ్‌, లక్కీ ఇద్దరూ కలిసి మందు తాగుతుంటారు. లక్కీ మందు కలుపుతుంటే.. రాజు ఎక్కువ వేయోద్దురోయ్‌ అంటూ చెప్పగానే.. ఏమవుతుంది మామ.. ఎక్కువైతే మనం ఇక్కడే పడుకుందాం అంటాడు.. ఎన్నిరోజులైంది మామ మనం ఇలా సిట్టింగ్‌ వేసి అంటూ అయినా నాకన్నా నీకు నీ అత్తారింటి వాళ్లే ఎక్కువైపోయారు అంటూ లక్కీ బాధపడినట్టు నటిస్తుంటే.. నీకంటే నీ ఫ్రెండ్‌షిఫ్‌ కంటే.. ఎక్కువేం కాదురా అంటూ రాజు చెప్తుంటే.. పక్క నుంచి ఐశ్వర్య చూస్తూ.. ఏయ్‌ అసలు విషయం అడుగు అని సైగ చేస్తుంది. దీంతో లక్కీ మందు తాగుతూ.. రాజును మాటల్లో పెట్టి.. రాజు పెళ్లి గురించి అడగ్గానే.. రాజు మందుమత్తులో అసలు తమ పెళ్లే జరగలేదని చెప్తాడు. రాజు మాటలకు ఐశ్వర్య, లక్కీ షాక్‌ అవుతారు. ఏంటి మామ నువ్వనేది అని అడగ్గానే..

Advertisement

అవున్రా మాకు పెళ్లే కాలేదు అని చెప్తాడు. ఐశ్వర్య వీడియో రికార్డ్‌ చేస్తుంది లక్కీ అనుమానంగా అందరూ మీరిద్దరూ భార్యభర్తలు అనుకుంటున్నారు. అంతెందుకు నేను కూడ అనుకుంటున్నాను అని చెప్పగానే.. అనుకుంటున్నారా..? కానీ మేము భార్యాభర్తలం కాదు.. ఇదంతా ఒక నటన మన జీవితం ఒక నటన అయితే అందులో ఇది ఒక పిట్టకథ లాంటిది అని చెప్తుంటే.. లక్కీ అసలు అలా నటించాల్సిన అవసరం ఏంటి..? మీరిద్దరు భార్యాభర్తలుగా నటించాల్సిన అవసరం ఏంటి..? అని అడగ్గానే.. రాజు అవసరాల కోసం మనుషులు రకరకాల పాత్రలు వేస్తుంటారు. అందులో నేను వేస్తున్న ఈ పాత్ర పేరే అద్దెమొగుడు అని చెప్పగానే.. లక్కీ ఆశ్చర్యంగా అద్దెమొగుడా..? అంటాడు. అవును అన్నింటికి ఆశ్చర్యంగా అడుగుతావేంట్రా.. ఆ పాత్రకు పేమెంట్‌ ఎక్కువగా వస్తుందని వేస్తున్నాను.. ఊరికే ఎవరు నటిస్తాడు.. అనగానే..? అంటే నువ్వు డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావా..? అయితే కొంచెం అప్పుడప్పుడు నాక్కూడా కొంచెం డబ్బులు కొట్టు మావా అంటూ అనగానే.. సరేలే అంటాడు రాజు. మొత్తం వీడియో తీసిన ఐశ్వర్య ఓరే రాజుగా నీ కథ ఇక చెప్తాను. మీ కథ అందరికీ తెలిసే పార్టీలో ఈ వీడియో ఎలా బయటపెడతానో చూడు అనుకుంటూ ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

వెంకట్‌కు వాళ్ల బాస్‌ ఫోన్‌ చేసి వస్తున్నావా..? లేదా అని అడగ్గానే.. వస్తున్నాను సార్‌ అంటూ ఆఫీసుకు వెళ్లబోతుంటే. లక్ష్మీ టిఫిన్‌ చేయమని అడుగుతుంది. లేట్‌ అవుతుంది బయటకు వెళ్లి తింటాను అంటాడు వెంకట్‌. కనీసం బాక్స్‌ అయినా తీసుకెళ్లమని చెబితే లేట్‌ అవుతుంది అని వెంకట్‌ అనగానే.. చలపతి అనుమానంగా అసలు నువ్వు చేస్తుంది సాప్ట్‌వేర్‌ జాబేనా అంటాడు. సాఫ్ట్‌వేరే అంటూ ఈ జాబ్‌ కూడా పోతే బాగుండదని కష్టపడుతున్నానని బాక్స్‌ ఇవ్వమని చెప్తాడు. లక్ష్మీ బాక్స్‌ ఇవ్వగానే తీసుకుని వెళ్లిపోతాడు. చలపతి మాత్రం రాజు గురించి ఆలోచిస్తూ.. ఫోన్‌ చేస్తాడు. ఇందుతో మాట్లాడుతున్న రాజు, చలపతి ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు. ఎందుకు చేయడం లేదని ఇందు అడిగితే మా నాన్న గురించి నీకు తెలియదు.. అంటూ సరే సరే నేను డ్రెస్‌ చేంజ్‌ చేసుకోవాలి నువ్వు బయటకు వెళ్లు అంటాడు.

Advertisement

వెంకట్‌ డెలివరీలు చేయడంలో చాలా బిజీగా అయిపోతాడు. కనీసం మధ్యాహ్నం భోజనం తినడానికి కూడా టైం లేనంతగా డెలివరీలు చేస్తుంటాడు. ఆ రోజుకు చేయాల్సిన డెలివరీలు కంప్లీట్ చేసుకుని భోజనం చేయాలని చూస్తే బాక్స్‌లోని అన్నం పాడైపోయి ఉంటుంది. దీంతో వెంకట్‌ ఆ అన్నం పారేసి బాక్స్‌ క్లీన్‌ చేసి నీళ్లతో కడుపు నింపుకుందామని నీళ్లు తాగుతుంటే.. నందు వచ్చి నీళ్లతో కడుపు నింపనుకుంటున్నావురా..? అంటూ అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×