E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 19th: శృతి రవి ఇద్దరు రెస్టారెంట్లో పని చేసుకుంటూ ఉండగా ప్రభావతి అప్పుడే ఫోన్ చేస్తుంది.. ఎవరు ఫోన్ అని శృతి అడుగుతుంది. మీనా వదిన చేసిన వంట మా అమ్మకు వద్దంట ఇవాళ స్పెషల్ గా ఏదైనా తీసుకురావాలి అని అంటుంది. ఆంటీ మీనా వంటని కాదన్నా అంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. మీనా బాలుని ఎప్పుడెప్పుడు దిగజారియలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటుంది కదా అలా ఏమన్నా జరిగింటుందని శృతి కంగారు పడిపోతూ ఉంటుంది. శృతి అన్న మాటలు విన్న రవి మా అమ్మ మళ్లీ అంత శాడిస్ట్ కాదు కానీ నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉంది అని శృతి రవి ఇద్దరు ప్రభావతిపై అనుమానం వ్యక్తం చేస్తారు.. ఏదో జరుగుతుంది అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. మీనా మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఈవెంట్ మేనేజర్ మోసంని ఓనర్ కి చెప్పాలని అనుకుంటుంది. చదువు రాదు అని మీనాన్ని దారుణంగా మోసం చేసిన మేనేజర్ పని ఎలాగైనా చూడాలి అని అనుకుంటుంది.

ఓనర్ తో మాట్లాడిన మీనా..

మీనా ఫంక్షన్ హాల్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఆ ఓనర్ గారు నాకు న్యాయం చేయండి అని ఎంతగా బతిమిలాడుతుందో అది చూసిన అందరికీ కన్నీళ్లు వస్తాయి.. మీనా అంతగా బ్రతిమలాడం చూసిన ఎవరైనా సరే ఒక్కసారిగా షాక్ అవుతారు సర్ నాకు ఇచ్చింది లక్ష రూపాయలు మాత్రమే కానీ ఆ మేనేజరు 10 లక్షలు ఇచ్చేసినట్లు చెప్తున్నాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఓనర్ గారు మీరు నాకు న్యాయం చేయండి అంటూ ఓనర్ దగ్గరికి వెళ్లి బ్రతిమలాడుతుంది మీనా.. అయితే ఓనరు ఆ మేనేజర్ ని పిలువు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటాడు.. మీనా బాధని అర్థం చేసుకున్న ఓనర్ మేనేజర్ ని తిడతాడు. కానీ తను మాత్రం నేను కరెక్ట్ గా నీకు ఇచ్చాను అని ఓనరు నువ్విలా చేయడం తప్పు అమ్మ డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వలేదని ఎందుకు అంటున్నావు అని అనగానే మీనా షాక్ అవుతుంది.

మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన మీనా..

Advertisement

మేనేజరు తప్పుడు లెక్కలు చూపించడంతో మీనా ఎంత చెప్తున్నా సరే ఓనర్ మాత్రం అస్సలు వినడు. మీనాదే తప్పు అని అనుకుంటాడు.. మీనా ఎంతగా బ్రతిమిలాడినా సరే అసలు వినకుండా మేనేజరు చింతామణి చెప్పినట్లు చేసి మీనాని మోసం చేస్తాడు.. పాపం మీనా అందరి దగ్గరికి వెళ్లి తను నిజాయితీగా చేశాను అని ఒప్పుకుంటున్నా సరే ఎవరు మాత్రం తన మాట వినరు. అయితే ఆ ఫంక్షన్ హాల్ ఓనరు చింతామణికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. చింతామణి మాట విన్న మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఎప్పుడు ఆర్డర్లు వచ్చినా చింతామణికి ఇస్తావు కదా ఇప్పుడేంటి ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అసలు అని అడగగానే మీనా అసలు విషయం అది అని తెలుసుకుంటుంది..

చింతామణి కుట్ర గురించి తెలుస్తుందా..?

మేనేజర్ చింతామణికి ఇవ్వకుండా మీనాకు ఇచ్చారు అని అనగానే మీ నాకు ఇదంతా చింతామణి ప్లాను అని అర్థమవుతుంది.. మీనా చేసిన ఒకే ఒక్క తప్పు ఆ మేనేజర్ ని గుడ్డిగా నమ్మి డబ్బులు తీసుకోకుండా పనిచేయడమే. అతను కూడా చింతామణి మనిషి అని తెలుసుకున్న మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలాగైనా సరే చింతామణి కి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది.. చింతామణికి నేను ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా ఆడుకుంటుంది అని నేను అనుకుంటుంది. ఏది ఏమైనా కూడా చింతామణి మరోసారి తనని దెబ్బ కొట్టింది అని చాలా బాధపడిపోతుంది మీనా.. నేనెవరికీ ఏ పాపం చెయ్యకపోయినా నన్ను ఇలా చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు అని మీ నా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తను ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అని ఆలోచిస్తూ బాధపడిపోతుంది..

బాలుకు నిజం తెలుస్తుందా..?

Advertisement

మీనా మేనేజర్ చేసిన మోసాన్ని ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని అనుకుంటుంది. తను ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదు అని మీనా బాధపడిపోతూ ఉంటుంది. కానీ ప్రభావతి మాత్రం మీనా ఓడిపోయింది అని చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. చింతామణి దగ్గరికి మీనా వెళ్తుందా లేదా బాలురంగంలోకి దిగుతాడు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కూడా మీనా లాంటి మంచి మనిషికి ఇలాంటి మోసం జరగడం చాలా బాధగా ఉంది అని అభిమానులు ఫీలవుతున్నారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×