E-Paper
Advertisement

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!
Advertisement

Most Beautiful Monsoon Valleys in India: వర్షాకాలం ప్రారంభం కాగానే పలు ప్రదేశాలు కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పచ్చని కొండలు, ఉప్పొంగే జలపాతాలు, పొగమంచుతో కప్పుకున్న లోయలు, రంగురంగుల అడవి పూలు ప్రకృతిని మరింత మనోహరంగా మారుస్తాయి. కొన్ని ప్రాంతాలు కేవలం వర్షాకాలంలోనే తమ అసలు అందాలను చూపిస్తాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లవర్ వ్యాలీ, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌లోని ఫ్లవర్ వ్యాలీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. నందాదేవి పర్వతాల మధ్య ఉన్న ఈ లోయలో వర్షాకాలంలో వందలాది రకాల అడవి పూలు వికసించి రంగుల ప్రపంచాన్ని తలపిస్తాయి.

తీర్థన్ లోయ, హిమాచల్ ప్రదేశ్‌

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లోని తీర్థన్ లోయ ప్రశాంత వాతావరణం, పచ్చని అడవులు, ఆపిల్ తోటలు, పారే నదులతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. నాగాలాండ్‌ లోని జూకౌ లోయ కూడా వర్షాకాలంలో మాత్రమే కనిపించే అరుదైన లిల్లీ పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

చిరపుంజి,మేఘాలయ

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి. భారీ జలపాతాలు,రూట్ బ్రిడ్జిలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని తెస్తాయి.

అతిరప్పిల్లి, కేరళ

Advertisement

కేరళలోని అతిరప్పిల్లి జలపాతం వర్షాకాలంలో మరింత ఉధృతంగా ప్రవహిస్తూ అద్భుత దృశ్యాన్ని అందిస్తుంది. ఇక వయనాడ్ పచ్చని తేయాకు తోటలు, ఎడక్కల్ గుహలు, వర్షారణ్యాలతో సందర్శకులను ఆకర్షిస్తుంది.

కూర్గ్, కర్ణాటక

కర్ణాటకలోని కూర్గ్ వర్షాలతో మరింత పచ్చగా మారి కాఫీ తోటల మధ్య అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అగుంబే రాజనాగులకు ప్రసిద్ధి చెందడమే కాకుండా, దట్టమైన వర్షారణ్యాలతో ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుంది.

మహాబలేశ్వర్, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, లోనావాలా, అంబోలి, కాస్ పీఠభూమి వర్షాకాలంలో అత్యంత అందంగా కనిపించే ప్రాంతాలు. ముఖ్యంగా కాస్ పీఠభూమి వేలాది అడవి పూలతో రంగుల తివాచీలా మారిపోతుంది.

Read Also: మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

ఉదయ్‌పూర్, రాజస్థాన్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వర్షాలతో నిండిన సరస్సులు, రాజభవనాలతో మరింత అందంగా మెరిసిపోతుంది. బూందీలోని పురాతన మెట్ల బావులు, మౌంట్ అబూలోని దిల్‌వారా దేవాలయాలు వర్షాకాలంలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఓర్చా, మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌లోని ఓర్చా వర్షాలతో ఉప్పొంగే బెట్వా నది ఒడ్డున ఉన్న చారిత్రక కట్టడాలతో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అటు మాండులోని జహాజ్ మహల్, హిందోలా మహల్ వంటి చారిత్రక నిర్మాణాలు వర్షపు నీటితో నిండిన సరస్సుల మధ్య తేలుతున్నట్టుగా కనిపించడం అద్భుతంగా ఉంటుంది.

వర్షాకాలంలో ప్రకృతి తన అసలైన అందాన్ని చూపించే ఈ  ప్రాంతాలు పర్యాటకులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తాయి. పచ్చని ప్రకృతి, ఉప్పొంగే జలపాతాలు, చారిత్రక కట్టడాలు, అరుదైన పుష్పాలతో మరింత ఆకట్టుకుంటాయి. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించాలనుకునే వారికి బెస్ట్ మాన్సూన్ డెస్టినేషన్స్ గా నిలుస్తాయి.

Read Also: వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×