E-Paper
Advertisement

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?
Advertisement

Amarnath Yatra Suspended: జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు-స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. దీంతో వివిధ ప్రాంతాల బేస్ క్యాంపుల వద్ద యాత్రికులను నిలిపివేశారు అధికారులు.

అమర్‌నాథ్ యాత్రకు అడ్డంకులు-జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిన్నటివరకు మంచు శివలింగం అమాంతంగా  కరిగిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో భక్తుల్లో అలజడి మొదలైంది. ఏడాది తర్వాత యాత్ర ప్రారంభమైన తర్వాత అడ్డంకులు ఎదురవుతున్నాయి.  తాజాగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.

Advertisement

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్-దీంతో అమర్‌నాథ్- వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు  అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు-స్థానిక యంత్రాంగం తెలిపాయి. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.  భక్తుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

వాతావరణ శాఖ హెచ్చరికలు-యాత్రికులు ఓపికగా ఉండాలని, బోర్డు అధికారిక సమాచారం ఇచ్చేవరకు తాజా సమాచారాన్ని అనుసరించాలని సూచించింది. ఐఎమ్‌డి అంచనాల నేపథ్యంలో జూలై 19 నుంచి నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులు తెలిపారు. జులై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

భక్తులకు ఆదేశాలు జారీ చేసిన అధికారులు-వాతావరణ శాఖ  జారీ చేసిన  నివేదిక మేరకు జులై 19-23 వరకు జమ్మూకశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఒక్కోసారి  ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని పేర్కొంది. కొండచరియలు విరిగిపడటం, నీటి మట్టం పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.  వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర నిలిపివేసిన మార్గాల్లో భద్రతను సమీక్షించిన తర్వాత పునఃప్రారంభంపై ప్రకటన చేస్తామని తెలియజేశారు. అటు వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ALSO READ: ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

ఆదివారం నుంచి బల్తాల్, నున్వాన్, చందన్‌వారి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు ముందుకు వెళ్లేందుకు అనుమతి ఉండదన్నారు. ప్రస్తుతం యాత్రలో ఇప్పటివరకు 3.76 లక్షల మందికి పైగా యాత్రికులు అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకున్నారు.  షెడ్యూల్ ప్రకారం యాత్రం ఆగష్టు చివరినాటికి ముగియనుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×