E-Paper
Advertisement

Big TV Kissik Talks: బిగ్ బాస్ కి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే.. గుట్టురట్టు చేసిన శ్రీజ!

Big TV Kissik Talks: బిగ్ బాస్ కి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే.. గుట్టురట్టు చేసిన శ్రీజ!
Advertisement

Big TV Kissik Talks:ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎప్పటికప్పుడు వినూత్నమైన షో లతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి సరికొత్త షోతో మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అదే కిస్సిక్ టాక్స్. గత కొన్ని వారాలుగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ షోతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రముఖ జబర్దస్త్ లేడి కమెడియన్ వర్ష (Varsha) హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు మరింత ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ షో 48వ ఎపిసోడ్ ప్రసారం అవ్వగా.. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ దమ్ము శ్రీజ (Dammu Srija) గెస్ట్ గా వచ్చింది. బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే డబ్బులు కట్టాల్సిందే అంటూ వస్తున్న వార్తలపై ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బిగ్ బాస్ కి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందేనా?

Advertisement

బీటెక్ చేసి, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా మారిన శ్రీజ సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసేది. అయితే లక్షల జీతం వదులుకొని బిగ్ బాస్ పై ఇష్టంతో అగ్నిపరీక్షలో సత్తా చాటి, బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. తన ఆట మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట్లో శ్రీజ దూకుడు చూసి కచ్చితంగా ఫినాలే వరకు వెళ్తుందని చాలామంది అనుకున్నారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా ఐదవ వారంలోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది . ఇక ఈ ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీజ ది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేశారు. ముఖ్యంగా భరణిని కాపాడేందుకు శ్రీజాను బలి చేశారనే కామెంట్స్ కూడా వినిపించాయి.

Advertisement

ALSO READ:Star Singer Death: ప్రముఖ సింగర్ మృతి.. ఇంత నరకం అనుభవించారా?

ఊహించని సమాధానం ఇచ్చిన శ్రీజ..

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్రీజ పలు టీవీ షోలలో సందడి చేస్తూనే.. “ఇప్పుడు కిస్సిక్ టాక్స్ కి కూడా గెస్ట్ గా వచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే డబ్బులు కట్టాలనే ఒక వార్త వినిపిస్తూ ఉంటుంది నిజమేనా? ” అని వర్షా ప్రశ్నించగా.. “అంత డబ్బులు నీ దగ్గరే ఉంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్తావ్.. ఒకవేళ నా దగ్గరే డబ్బులు ఉంటే నేను ఎందుకు అంత జాబ్ వదులుకొని అక్కడికి వెళ్తాను. డబ్బు వస్తుంది.. గుర్తింపు వస్తుంది..

బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్లాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి నేను ఒక్కరికి కూడా కనీసం అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదు. టాలెంట్ ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. డబ్బు కట్టాల్సిన అవసరం లేనేలేదు. అవన్నీ ఫేక్ వార్తలు” అంటూ కొట్టి పారేసింది. మొత్తానికైతే ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే డబ్బులు కట్టాలి అనే ఒక అపోహని ఈమె ఒక్క మాటతో చెరిపేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×