E-Paper
Advertisement

Ponguleti Prasad Reddy: ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. ప్రసాద్ రెడ్డి పర్యటనతో ఫుల్ జోష్!

Ponguleti Prasad Reddy: ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. ప్రసాద్ రెడ్డి పర్యటనతో ఫుల్ జోష్!
Advertisement

Ponguleti Prasad Reddy: ఖమ్మం, స్వేచ్ఛ: మున్సిపల్ పోరులో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఏదులాపురం పట్టణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత పొంగులేటి ప్రసాద్ రెడ్డి (Ponguleti Prasad Reddy) పర్యటనతో ఎన్నికల వాతావరణం ఫుల్ హీటెక్కింది. వార్డు వార్డుకూ తిరుగుతూ ఆయన చేసిన ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.

Also ReadNalgonda Politics: నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు.. రెబల్స్ పై ప్రధాన పార్టీల దృష్టి !

జనం మధ్యలోకి.. సమస్యల దగ్గరకు

Advertisement

ఉదయం శాబాదు నగర్ (28వ వార్డు), లిప్రసీ కాలనీ (30వ వార్డు) లలో ప్రసాద్ రెడ్డి పర్యటించారు. ప్రజలతో నేరుగా ముచ్చటించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ర్యాలీతో దద్దరిల్లిన వీధులు

సాయంత్రం నాయుడుపేట (3వ వార్డు) నుంచి లక్ష్మి బృందావనం కాలనీ వరకు ర్యాలీ సాగింది. ఆదిత్య నగర్, కార్తికేయ టౌన్‌షిప్ మీదుగా సాగిన ఈ ర్యాలీకి జనం వెల్లువలా తరలివచ్చారు. దారిపొడవునా మహిళలు హారతులతో ప్రసాద్ రెడ్డికి వెల్కమ్ చెప్పారు. కాంగ్రెస్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. ఏదులాపురం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Also Read: Gadwal Municipality: గద్వాల్లో రగులుతున్న విచిత్ర రాజకీయం.. కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×