E-Paper
Advertisement

Swarna Nagari Express: స్వర్ణనగరి రైలులో మంటలు.. సిబ్బంది అలర్ట్, తప్పిన పెను ప్రమాదం

Swarna Nagari Express: స్వర్ణనగరి రైలులో మంటలు.. సిబ్బంది అలర్ట్, తప్పిన పెను ప్రమాదం
Advertisement

Swarna Nagari Express: స్వర్ణనగరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకి పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్టయిన రైల్వే సిబ్బంది స్పందించారు. రైలు ఆపి అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫలితంగా పెను ప్రమాదం తప్పింది. ఇంతకీ రైలు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తోంది.

స్వర్ణనగరి రైలులో చెలరేగిన మంటలు

Advertisement

ఈ మధ్యకాలంలో రైలులో మంటలు చెలరేగుతున్న ఘటనలు క్రమంగా పెరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ నుండి జైసల్మేర్ వెళ్తున్న స్వర్ణగరి ఎక్స్‌ప్రెస్ రైలు పెను ప్రమాదం తప్పింది.

ఆ రైలు.. జేతా-చందన్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ రైలు కోచ్ కింద నుంచి అకస్మాత్తుగా నిప్పురవ్వలతోపాటు మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి పొగ రావడంతో ప్రయాణికులతోపాటు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోగా రైలుని నిలిపివేశారు.

Advertisement

అలర్టయిన రైల్వే సిబ్బంది.. అదుపులోకి మంటలు

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన ప్రయాణికుల్లో భయాందోళనలకు గురిచేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే విభాగం తెలిపింది. వెంటనే రైల్వే సాంకేతిక బృందం అక్కడికి చేరుకునింది.

కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్వర్ణనగరి రైలు జైసల్మేర్‌కు బయలుదేరింది.  ఈ రైలు ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి జైసల్మేర్‌కు బయలుదేరింది. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన రైళ్లు దాదాపు గంట వరకు నిలిపివేశారు అధికారులు.  ఆ తర్వాత మెల్లగా కదులుతున్నాయి.

ALSO READ: చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను 

బ్రేక్ సిస్టమ్‌లో ఓ భాగంలో అధిక వేడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే మంటలకు ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. రైల్వే సాంకేతిక బృందం వివరణాత్మక దర్యాప్తును కొనసాగిస్తోంది. రైల్వే సిబ్బంది, లోకో పైలట్ వెను వెంటనే వ్యవహరించిన తీరును ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×