E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం నిరూపించిన అప్పు 

Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం నిరూపించిన అప్పు 
Advertisement

Brahmamudi serial today Episode:

ఐసీయూలో కావ్య దగ్గర ఉన్న రాజ్‌ను చూసి డాక్టర్‌ ఆశ్చర్యపోతుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. దీంతో రాజ్ మీరే చెప్పారు కదా డాక్టర్‌ నేను వస్తేనే నా భార్య ఆపరేషన్‌ చేయించుకుంటుందని అందుకే వచ్చేశాను అంటాడు రాజ్‌. ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకురమ్మని చెప్పింది ఒక నేరస్థుడిగా కాదు అంటుంది డాక్టర్‌.. దీంతో కావ్య ఏడుస్తూ.. డాక్టర్‌ గారు నా భర్త నేరస్థుడు కాదు ఆయన ఏ తప్పు చేయలేదు అంటుంది. కానీ నీ భర్తను ఇక్కడ పెట్టుకుని నేను ఏ ఆపరేషన్‌ చేయలేను. తప్పు చేసి తప్పించుకుని వచ్చిన ఒక క్రిమినల్‌ ఇలా ఆపరేషన్‌ థియేటర్‌లో ఉంటే.. మా హాస్పిటల్‌కు నాకు చెడ్డ పేరు వస్తుంది దయచేసి బయటకు వెళ్లండి అని చెప్పగానే.. కావ్య కంగారు పడుతుంది. డాక్టర్‌ నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే నేను తట్టుకోలేను డాక్టర్ అని చెప్తుంది.

కానీ ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే మా బాధ్యతను కూడా మేము నిర్వర్తించలేము. ఇది మా వృత్తికే మంచిది కాదు అని చెప్పగానే.. రాజ్‌ చేతులు జోడించి ఫ్లీజ్‌ డాక్టర్‌ కాస్త కనికరించండి.. నా భార్య తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోస్తుంది. కానీ ఆ ప్రాణం ఊపిరి పోసుకోవాలంటే నా ప్రాణం నిలబడాలి. నా భార్య ప్రాణం నేనే డాక్టర్‌. నా భార్య పరిస్థితి ఏంటో మీకు తప్ప ఇక్కడ ఎవ్వరికీ తెలియదు.. దయచేసి నా భార్య బతకాలన్నా.. నా బిడ్డను బతికించాలన్నా..? నేను ఇక్కడే ఉండాలి డాక్టర్‌ కాదనండి ఫ్లీజ్‌ డాక్టర్‌ అంటూ రాజ్‌ అడగ్గానే.. డాక్టర్‌ కోపంగా బయట పోలీసులు లోపల మీరు మీకు అర్థం అవుతుందా..? అంటుంది. అందుకే డాక్టర్‌ వాళ్లు లోపలికి రాలేరు కనుకే ఆపరేషన్‌ అయ్యే దాకా నేను నా భార్య పక్కనే ఉంటానంటున్నాను.. నా భార్య డెలివరీ అవ్వగానే ఒకసారి నా బిడ్డను చూసి వెళ్లిపోతాను. ఇంకే ప్రాబ్లమ్‌ క్రియేట్‌ చేయలేను డాక్టర్‌ ఫ్లీజ్‌ డాక్టర్‌ అర్థం చేసుకోండి.. అంటూ రిక్వెస్ట్‌ చేస్తాడు. కావ్య కూడా ఫ్లీజ్ డాక్టర్‌ నా భర్తను నా పక్కనే ఉండనివ్వండి.. ఫ్లీజ్‌ అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో డాక్టర్‌ సిస్టర్‌ను పిలిచి కావ్యను ఆపరేషన్‌ థియేటర్‌కు షిప్ట్‌ చేయండి అని చెప్పగానే.. సిస్టర్‌ సరే అంటుంది.

Advertisement

ఐసీయూ బయట నిలబడిన అప్పు కానిస్టేబుల్స్‌ ను పది నిమిషాలు పక్కకు వెళ్లండి నేను మా వాళ్లతో మాట్లాడతాను అంటుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఏమిటే మాట్లాడేది.. నీకు డ్యూటీ పిచ్చి పట్టింది అంటూ తిడుతుంది. దీంతో అప్పు డ్యూటీ అంటే పిచ్చి కాదు అమ్మమ్మ.. మా అక్క అంటే ప్రేమ, బావంటే అభిమానం. అందుకే ఇప్పటికే బావ చేయని తప్పుకు దోషిలా మారాడు.. ఇప్పుడు ఇంకో తప్పు చేసి బావ ఇరుక్కుపోవద్దనే.. అరెస్ట్ చేసి స్టేషన్‌ లో అప్పగిస్తాను అన్నాను అని చెప్పగానే.. అపర్ణ కోపంగా అరెస్ట్‌ చేసి నా కొడుకును స్టేషన్‌ లో అప్పజెప్పి ఆదర్శమైన పోలీస్‌ అనిపించుకోవాలి అనుకుంటున్నావా.? మరి చావు బతుకుల మధ్య ఉన్న కావ్య పరిస్థితి ఏంటి..? దాని బతుకు ఏమవ్వాలి అనుకుంటున్నావు అంటూ నిలదీయగానే.. కళ్యాణ్‌ కల్పించుకుని పెద్దమ్మ మనందరికి తెలుసు అప్పు అలా చేయదని అయినా అప్పు అన్నయ్యకు అడ్డు పడిందంటే తనకు ఎంత ప్రెజర్‌ ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పగానే..

ధాన్యలక్ష్మీ కోపంగా అదే ఆలోచన నీ పెళ్లానికి ఉందారా..? ఉంటే రాజ్‌ కోసం కావ్య కళ్లల్లో వత్తులు వేసుకుని ఊపిరి బిగబట్టుకుని చూస్తుంటే.. ఏ దేవుడో కరుణించి కావ్యను కాపాడతాడో అని మేమంతా బాధపడుతుంటే.. రాజ్‌ను కావ్య దగ్గరకు వెళ్లకుండా ఆపతుందా…? అరెస్ట్‌ చేస్తుందా…? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో అప్పు బాధగా మీకు దండం పెడతాను ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించండి. ఆఫ్‌ డ్యూటీలో ఉన్నా కూడా నాకు ఆర్డర్స్‌ వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.. బావను అడ్డుకున్నప్పుడు బావతో అలా మాట్లాడినప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఆలోచించండి.. ఏదో ఒకటి చేసి బావను ఈ కేసులోంచి బయటకు తీసుకోస్తాను అని చెప్పి అప్పు, కళ్యాణ్‌ను తీసుకుని వెళ్తుంది. స్టేషన్ కు వెళ్లిన అప్పు సెల్‌ లో ఉన్న శాండీని ఇంటరాగేషన్‌ చేస్తుంది. శాండీ చెప్పిందంతా అబద్దం అని ప్రూవ్‌ చేస్తుంది. రాజ్‌ నిర్ధోషి అని నిరూపిస్తుంది.

Advertisement

మరోవైపు హాస్పిటల్‌లో కావ్యకు పాప పుడుతుంది. పాపను చూసి రాజ్‌, కావ్య హ్యాపీగా ఫీలవుతారు. బేబీ బరువు తక్కువగా ఉందని ఇంక్యుబేటర్‌లో పెడుతుంది డాక్టర్‌. మరోవైపు మినిస్టర్‌ వైఫ్‌ తులసికి కూడా పాపే పుడుతుంది. కానీ పాప కదలదు ఏడ్వదు.. దీంతో ఆ పాపను కూడా ఇంక్యుబేటర్‌లో పెడతారు డాక్టర్లు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×