E-Paper
Advertisement

Korean Thriller OTT : సీరియల్ కిల్లర్ బాడీలోకి హీరో కన్ను… నెక్ట్స్ ట్విస్ట్ కి దిమాక్ కరాబ్

Korean Thriller OTT : సీరియల్ కిల్లర్ బాడీలోకి హీరో కన్ను… నెక్ట్స్ ట్విస్ట్ కి దిమాక్ కరాబ్
Advertisement

Korean Thriller OTT : ఒక అదిరిపోయే కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ పై ఓ లుక్ వేయండి. దీనిని చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అయితే ఈ సిరీస్‌లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది కేవలం పెద్దలకు మాత్రమే. ముఖ్యంగా హీరో పాత్రలో నటించిన జంగ్ హే-ఇన్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. మీరు క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ కథలను ఇష్టపడితే, ఈ సిరీస్ మాత్రం బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడవచ్చు అంటే ?

2022లో వచ్చిన ఈ కొరియా సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘కనెక్ట్’ (Connect). ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక కొరియన్ డ్రామాను జపాన్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు తకాషి మైకే తెరకెక్కించడం ఇదే మొదటిసారి. ఇది 2022 డిసెంబర్ 7న 6 ఎపిసోడ్స్ తో Jio Hotstar ప్లాట్‌ ఫామ్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, కొరియన్ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జంగ్ హే-ఇన్, కో క్యుంగ్-ప్యో, కిమ్ హ్యే-జున్ లీడ్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో దీనికి 6.5/10 రేటింగ్ ఉంది.

Advertisement

Read Also :  మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

కథలోకి వెళ్తే

ఈ కథ హా డాంగ్-సూ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ‘కనెక్ట్’ అనే ఒక కొత్త జాతికి చెందిన వ్యక్తి. ఇతనికి ఒక విచిత్రమైన పవర్ ఉంటుంది. అంటే  చనిపోయినా మళ్ళీ బతికే శక్తి ఉంటుందన్నమాట. ఒక రాత్రి డాంగ్-సూను స్మగ్లర్లు కిడ్నాప్ చేసి, అతని ఒక కన్నును తీసేస్తారు. ఆ కన్నును ఓ జిన్-సియోప్ అనే సీరియల్ కిల్లర్‌కు అమర్చుతారు. అయితే ఆ తరువాత అక్కడి నుంచి డాంగ్-సూ తప్పించుకుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. దీనివల్ల డాంగ్-సూకి తన కన్ను ద్వారా ఆ హంతకుడు చేసే పనులు, హత్యలు కనిపిస్తూ ఉంటాయి. తన కన్నును తిరిగి పొందడానికి, ఆ కిల్లర్ చేస్తున్న దారుణాలను ఆపడానికి డాంగ్-సూ ఒక భీకర పోరాటమే చేయాల్సి వస్తుంది. ఈ పోరాటంలో డాంగ్-సూ కిల్లర్ ఆగడాలను ఆపుతాడా ? తన కంటిని తిరిగి పొందుతాడా ? ఈ సిరీస్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను మాత్రం, ఈ కొరియా సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×