// //
Makara Sankranti-2026: మరక సంక్రాంతి పండుగ విశిష్టత అంతా ఇంతా కాదు. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజును మరక సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే మకర సంక్రాంతి రోజు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు. సంక్రాంతి మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైనది ఇది.
దేశవ్యాప్తంగా ఇవాళ మకర సంక్రాంతి
ఒక్కమాటలో చెప్పాలంటే సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక. భోగభాగ్యాలు, సిరి సంపదలను కురిపిస్తూ కొత్తకాంతులను విరజిమ్ముతాయి. పాడిపంటలతో పల్లె సీమలు కళకళలాడుతాయి. ఏడాదంతా కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం కూడా ఇదే. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కొత్త అల్లుళ్ళ పల్లెలు, పట్టణాలు సందడిగా మారే రోజు. చిన్నారులకు గాలి పటాల పండుగ. దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం ప్రవేశించే గడియలు కావడంతో ‘ఉత్తర క్రాంతి’గా పిలుచుకుంటారు.
సంక్రాంతి రోజున నిద్ర లేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత పూజలు చేస్తారు. రవి సంక్రమణ సమయంలో పితృ దేవతలకు తర్పణాలు, దానాలు చేస్తారు. ఇది ఆచార వ్యవహారాల్లో ఒక భాగం కూడా. మరక సంక్రాంతి రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. పెద్ద పండుగ రోజున రకరకాల నిత్యావసర వస్తువులను దానం చేస్తారు.
కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు
దానివల్ల ఆ ఇంట శుభ ఫలితాలు వస్తాయని చెబుతారు. పితృ దేవతారాధన చేయడం వల్ల వారి ఆశీస్సులు లభించి అన్నింటా శుభాలు కలుగుతాయి. కొత్త దుస్తులు ధరించి సూర్య భగవానుడుని స్మరించుకోవాలి. పితృదేవతలకు ఆరాధన చేసినప్పుడు దేవుడికి పూజ చేస్తారు. నూతన వస్త్రాలు, పిండి వంటలను ముందు పెడతారు. పూజ తర్వాత ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. బూరెలు, గారెలు, అరిసెలు, జంతికలు, పులిహోర వంటి రకరకాల పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భోజనం
కొత్త కుండలో పాలు పొంగిస్తారు. అందులో కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండుతారు కూడా. దేశవ్యాప్తంగా మకర సంక్రాంతిని చేసుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఆ పండుగ చేస్తుంటారు అక్కడి ప్రజలు. ఏపీలో పెద్ద పండుగ, తమిళనాడులో పొంగల్, కేరళలో మకర వలిక్కు, ఒడిషాలో మరక సంక్రాంతి, బెంగాల్ లో పుష్ సంక్రాంతి, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌ల్లో మరక సంక్రాంతి పేరుతో చేస్తారు. గుజరాత్, రాజస్థాన్ ల్లో ఉత్తరాయణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో లోహ్రి వంటి పేర్లుతో ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు.
ALSO READ: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
మన హృదయాల్లో ఆనందం, కృతజ్ఞతా భావాలను నింపే పండుగ ఇది
ఈ పండుగకు, ప్రకృతితో ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికీ తెలిసిందే
ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సుఖ శాంతులు, ఆరోగ్యం ప్రసాదించాలని, మీ కలలన్నీ సాకారం కావాలి… pic.twitter.com/ZoVC9tnuf6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2026
సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యుని మకర సంక్రమణంతో కొత్త వెలుగులు, వాకిట్లో ముగ్గులు, రైతన్నల ఇంట పాడిపంటలు, పండుగ వేళ ప్రతి కుటుంబానికి సుఖశాంతులు, శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
“Om… pic.twitter.com/GCwvk76Pcl
— Telangana CMO (@TelanganaCMO) January 15, 2026
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం ‘‘మకర సంక్రాంతి’’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ, మన… pic.twitter.com/diGe84g8cw
— N Chandrababu Naidu (@ncbn) January 14, 2026