E-Paper
Advertisement

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!
Advertisement

BIG TV Re-launch: తెలుగు మీడియా చరిత్రలో సరికొత్త అధ్యాయం మెుదలైంది. నిఖార్సైన జర్నలిజం ఎలా ఉంటుందో ఈ-తరానికి రుచి చూపించేందుకు బిగ్ టీవీ కొత్తగా, సరికొత్తగా ప్రజల ముందుకు వచ్చింది. ఆదివారం ఉ.7 గంటల నుంచి బిగ్ టీవీలో తిరిగి వార్తా ప్రసారాలు పునః ప్రారంభమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి నెక్స్ట్ లెవల్లో వార్తా ప్రసారాలు ఉండనున్నాయి. సరికొత్త AR-VR టెక్నాలజీ, రొటిన్ కు భిన్నమైన రిపోర్టర్ల ప్రజెంటేషన్, వినూత్నమైన డిబెట్లను స్క్రీన్ పై చూడనున్నారు.

తెలుగు మీడియాలో ఫస్ట్ టైమ్..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మీడియా ఛానెళ్లు ఉన్నాయి. అయితే గతంలో ఎందులోనూ జరగని విధంగా బిగ్ టీవీ.. తనను తానూ రూపాంతరం చేసుకుంది. సాధారణంగా ఒక ఛానెల్ స్థాపించిన తర్వాత చిన్న చిన్న మార్పులు జరగడం సహజమే. కానీ తెలుగు మీడియా రంగంలో ఎప్పుడు లేని విధంగా ప్రజల కోసం కంప్లీట్ గా తనను తాను మార్చుకున్న ఛానెల్ బిగ్ టీవీనే కావడం విశేషం. ఛానెల్ లోగో నుంచి మైక్ వరకూ.. రిపోర్టర్ల డ్రెస్ కోడ్ నుంచి యాంకర్ల ప్రజెంటేషన్ వరకూ ఇలా ప్రతీ దాంట్లో కొత్త దనాన్ని ఆడియన్స్ చూడబోతున్నారు.

ప్రజలకు అవసరమైందే వార్త

Advertisement

ఇక మీదట బిగ్ టీవీ స్క్రీన్ పై అనవసర వార్తలు, ప్రజాప్రయోజనాలకు దూరంగా ఉండే కథనాలు కనుమరుగు కానున్నాయి. ప్రజల జీవితంతో ముడిపడి ఉన్న అంశాలు మాత్రమే బిగ్ టీవీ తెరపై కనిపించనున్నాయి. ఈ 2.0లో ప్రసారం చేసే ప్రతీ వార్త.. పల్లె నుంచి పట్నం వరకూ.. దేశం నుంచి విదేశాల వరకూ ప్రతీ తెలుగు వాడిని కదిలించేలా, ఆలోచింపజేసేలా ఉండనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యుడి మాటలా, ప్రజల గొంతుకగా.. నిస్సహాయకులకు ప్రతినిధిగా బిగ్ టీవీ మారనుంది.

Also Read: సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

అవినీతి పరులకు సింహస్వప్నం

Advertisement

బాహ్యప్రపంచానికి తెలియకుండా ప్రజలను పట్టి పీడిస్తున్న ఎన్నో రకాల సమస్యలను ఈ 2.0లో బిగ్ టీవీ తెరపైకి తీసుకురాబోతోంది. ప్రజలను వేధించే నాయకులు, అధికారుల బండారాన్ని బట్టబయలు చేయనుంది. ‘ఇది కదా ఇన్నాళ్లు మీడియా నుంచి కోరుకుంది’ అనే స్థాయిలో ఎంతో బాధ్యతాయుతంగా బిగ్ టీవీలో ప్రసారాలు ఉండనున్నాయి. అస్పష్టతకు, అనుమానాలకు తావు లేకుండా పక్కా సమాచారాన్ని మాత్రమే ప్రజల ముందు ఉంచేలా ఇకపై బిగ్ టీవీ ప్రయాణం సాగనుంది.

Also Read: ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

 

 

 

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×