E-Paper
Advertisement

Big Tv Kissik Talks: అమ్మాయిల పై వేధింపులు… కో** పడేయాలన్న వరలక్ష్మి!

Big Tv Kissik Talks: అమ్మాయిల పై వేధింపులు… కో** పడేయాలన్న వరలక్ష్మి!
Advertisement

Big Tv Kissik Talks: వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా పరిచయమైన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా, దర్శకురాలిగా నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big Tv Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు అలాగే సమాజంలో జరుగుతున్న అంశాల గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు.. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న పిల్లలపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ఏదో చెప్పాలి..

ఇలా లైంగిక దాడుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తున్నారు. ఈ అంశం గురించి వర్ష వరలక్ష్మి శరత్ కుమార్ ను ప్రశ్నిస్తూ వాటిపై తన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. పిల్లల విషయంలో పేరెంట్స్ ముందుగా నేర్పించాల్సిన విషయం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్పాలని తెలిపారు. మనం వీటిని నేర్పించినప్పుడే వాళ్ళు వచ్చి మనకు ఏ విషయమైనా చెబుతారు. అయితే మనం బాగా నమ్మిన వాళ్ల నుంచి మనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని వరలక్ష్మి తెలిపారు. తల్లితండ్రులు ఒక మనిషిని బాగా నమ్మారు అంటే వాళ్ళ బిడ్డ కూడా వారిని అంతే నమ్ముతుంది ఆ క్షణమే తప్పు కూడా జరుగుతుందని తెలిపారు.

అలాంటి వారిని చంపకూడదు..

Advertisement

మనదేశంలో ఇలాంటి వాటి గురించి మాట్లాడితే ఏదో తప్పు అని భావిస్తారు ఇలా మాట్లాడటానికి తప్పుగా భావించే మన దేశంలో చేయటం తప్పు అనిపించదు అందుకే పాపులేషన్ లో మన దేశం మొదటి స్థానంలో ఉందంటూ మాట్లాడారు. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి పిల్లలకు తప్పు ఏది కరెక్ట్ ఏది అనేది నేర్పించాలి. ఒకవేళ మీ చేతిలో కనుక పవర్స్ ఉంటే ఇలాంటి వాళ్లకు మీరు వేసే శిక్ష ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు వరలక్ష్మి సమాధానం చెబుతూ ఇలాంటి వాళ్లకు చావు అనేది చాలా చిన్న శిక్ష అని తెలిపారు. అలాంటి వాళ్ళని చంపకూడదు. పక్క దేశాలలో ఎవరినైనా తాకితే చెయ్యి నరికేస్తారు అలాంటిది మనపై లైంగికంగా దాడి చేస్తే వాటిని కట్ చేసి పడేయాల్సిందే అంటూ ఈమె చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Advertisement

మహిళలపై లేదా అమ్మాయిలపై దాడి చేసిన వారిని చంపితే అప్పటికే మర్చిపోతారు వాళ్ళు బ్రతుకుతూ జీవితాంతం చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలనే విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ వారి ప్రైవేటు పార్ట్స్ కట్ చేయాలి అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో చాలామంది వరలక్ష్మీ చెప్పిన మాటలు నిజమేనని, అలాంటి వారికి చావు శిక్ష కాదు జీవితాంతం చేసిన తప్పుకు బాధపడేలా శిక్ష వేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×