E-Paper
Advertisement

Vijay TVK Manifesto: అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, 8 గ్రాముల బంగారం, టీవీకే విజయ్ మేనిఫెస్టో మామూలుగా లేదుగా..!

Vijay TVK Manifesto: అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, 8 గ్రాముల బంగారం, టీవీకే విజయ్ మేనిఫెస్టో మామూలుగా లేదుగా..!
Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన పార్టీ ఎన్నికల మేనిఫేస్టోను వెల్లడిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. మహిళల సంక్షేమమే దిశగా వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ మహిళా యజమానికి నెలకు రూ.2,500 నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సాయంతో పాటు ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించడంతో సభకు వచ్చిన మహిళల నుండి భారీ స్పందన లభించింది.

తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించే దిశగా విజయ్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు ‘అన్న విజయ్ సాయం’ అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద పెళ్లి చేసుకోబోయే యువతులకు 8 గ్రాముల బంగారం సహా పట్టుచీరను ప్రభుత్వం తరపున బహూకరించనున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Advertisement

మహిళల భద్రత విషయంలో ఆయన అత్యంత కఠినమైన చర్యలు ప్రతిపాదించారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు బాడీ కెమెరాలతో కూడిన ‘రాణి వేలు నాచాయర్ ఫోర్సెస్’ పేరుతో 500 ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లో చీకటి ప్రాంతాలు లేకుండా పటిష్టమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తూ సిసిటివి నిఘా పెంచుతామని స్పష్టం చేశారు. ప్రజా రవాణాలో మహిళలు ఇబ్బంది పడకుండా స్మార్ట్ పానిక్ బటన్లు అమర్చుతామని హామీ ఇచ్చారు. అత్యవసర సమయంలో కేవలం ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా 24 గంటల కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంలోని లోపాలను విజయ్ ఎండగట్టారు. కొన్ని బస్సులకే ఈ సదుపాయం పరిమితం కావడం వల్ల మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని విమర్శించారు. టీవీకే అధికారంలోకి వస్తే ఎటువంటి పరిమితులు లేకుండా అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు పూర్తిస్థాయిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రకటనలతో తమిళ రాజకీయాల్లో విజయ్ తనదైన ముద్ర వేస్తూ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతున్నారు.

Advertisement

ALSO READ: Harish Rao: రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు.. మహా క్రూరుడు, హరీశ్ రావు సంచలన విమర్శలు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×