E-Paper
Advertisement

Kissik Talks: ఆ థాట్ ప్రాసెస్ వస్తేనే మార్పు.. లేదంటే దమ్ములేనట్టే!.. సోషల్ మీడియాపై వరలక్ష్మి

Kissik Talks: ఆ థాట్ ప్రాసెస్ వస్తేనే మార్పు.. లేదంటే దమ్ములేనట్టే!.. సోషల్ మీడియాపై వరలక్ష్మి
Advertisement

Kissik Talks: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను బాగా ఇబ్బంది పెడుతుంది ఏంటయ్య అంటే.. కచ్చితంగా సోషల్ మీడియా (Social Media)నే అని చెప్పుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ.. అల్లరల్లరి చేస్తున్నారు. ఎలాంటి సెలబ్రిటీ అయినా సరే, లెక్క చేయకుండా.. బూతు పదాలను ప్రయోగిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే స్టేజ్‌కి తెచ్చేశారు. తాజాగా సోషల్ మీడియాను ఉద్దేశించి జయమ్మ.. అదే వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘సరస్వతి’ (Saraswathi) చిత్రంతో దర్శకురాలిగా ప్రేక్షకులను పలకరించిన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar), బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా‌పై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ముఖం చూపించకుండా కామెంట్స్ చేసే వారికి దమ్ములేనట్టేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read- Konidela Surekha: మెగా ఫ్యామిలీని నేను మేనేజ్ చేస్తాను అనుకుంటారు.. కానీ నిజం ఏమిటంటే.. సురేఖ కీలక వ్యాఖ్యలు

ఏది ఎక్కువ అయితే అది పాయిజనే

Advertisement

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియాపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. అది పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అంతే. రజినీ సార్ ఒక డైలాగ్ చెప్తారు కదా.. ‘ఏది ఎక్కువ అయితే అది పాయిజన్ అవుతుంది. లిమిట్‌గా తీసుకుంటే అంతా బాగుంటుంది’ అని. అలాగే ఎక్కువగా ఏది చేసినా తప్పే. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఉంటుంది.. దానిని లిమిట్‌లో తీసుకుంటే ఓకే.. లేదంటే కొలెస్ట్రాల్ వస్తుంది.. అలాగే సోషల్ మీడియా కూడా. సోషల్ మీడియాలో కూడా క్రియేటివ్ సైడ్ ఉంది. చాలా మంది తమ టాలెంట్ చూపించుకోవడానికి యూజ్ అవుతుంది. దాని కోసం వాడుకోవచ్చు. నెగిటివ్ కామెంట్స్ కోసమే అయితే అవసరం లేదు. దాని వల్ల ఏం వస్తుంది? ఇతరులను హర్ట్ చేయడం తప్పితే.. దానివల్ల ఎటువంటి యూజ్ లేదు.

Also Read- Ustaad Bhagat Singh Trailer Tease: అది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్ముంటే దాటొచ్చు!

వాళ్లకి దమ్ములేనట్టే!

Advertisement

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ అన్నింటినీ పట్టించుకోకూడదు. ఒక మనిషి, తన ఫేస్‌ని చూపించకుండా కామెంట్స్ చేయడమంటే.. వాళ్లకి దమ్ము లేనట్టే. అసలు ఎవరు నువ్వు? నువ్వు నాకు చెప్పేది ఏంటి? నన్ను హర్ట్ చేసే పవర్ నేను నీకు ఇవ్వలేదు.. నువ్వు ఎలా నన్ను హర్ట్ చేస్తావ్? అలా ఆలోచించి నేను సోషల్ మీడియాను లైట్ తీసుకుంటాను. సపోజ్.. ‘ఈ డ్రస్సు మీకు సూట్ అవ్వలేదండి.. మీరు వేరే డ్రస్ ట్రై చేయండి అని చెప్పడం వేరు.. తూ.. ఇంత దరిద్రంగా ఉందేంటి నీ ఫేస్ అని చెప్పడం వేరు’. ఏదైనా చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడూ కూడా, ఎవరైనా సరే.. ఒక కామెంట్ పెట్టే ముందు మీరంతా అనుకోండి.. ‘నాకు ఎవరైనా ఇలా చెబితే ఎలా ఫీలవుతాను? అని ఒక్కసారి థింక్ చేసే థాట్ ప్రాసెస్ వస్తేనే మన హ్యుమారిటీ గ్రోత్ అవుతుంది. లేదంటే, అదే దరిద్రం, అదే చెండాలం కొనసాగుతుంది. ఎటువంటి గ్రోత్ ఉండదు.’’ అని సోషల్ మీడియాపై వరలక్ష్మి తన అభిప్రాయాన్ని చెప్పారు.

Also Read- Nayanthara: ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఇక బాలీవుడ్‌లో నయన్‌కు తిరుగులేనట్టే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×