E-Paper
Advertisement

Illu illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేమ అవుట్..!

Illu illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేమ అవుట్..!
Advertisement

Illu illaalu Pillalu Prema :  తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఒక తండ్రి తన పిల్లలు తన చెంతనే ఉండాలని ఒక కోరికతో లేనిపోని రూల్స్ పెడుతూ ఇబ్బంది పెడుతుంటాడు. తండ్రి మాట నువ్వు కాదనలేక ఆ కుటుంబంలోని పిల్లలు తండ్రి చెంతనే ఉండేందుకు ఒప్పుకుంటారు. తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక అందరూ కలిసి ఉంటారు. ముగ్గురు కొడుకులు కూడా తండ్రిని ఎదిరించాలని అనుకోరు.. ఇక ఆ ముగ్గురు కొడుకులకు ముగ్గురు భార్యలు వస్తారు.. పెద్ద కోడలు పెత్తనం కోసం మిగతా ఇద్దరికోడల్ని తొక్కేయాలని చూస్తుంది.. చిన్న చిన్న వాటికి కూడా ఆ కోడల్ని ఇంట్లో అత్తమామల దగ్గర ఇరికించాలని చూస్తుంది.. రెండవ కోడలు గవర్నమెంట్ కోడలు.. మూడవ కోడలు చదువుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా లక్ష్యంతో తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంది. ఆ పాత్రలో నటిస్తుంది ప్రేమ.. ప్రేమ గురించి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూనే ఉన్నాము.. అయితే ప్రేమ ఈ సీరియల్ లో ఇకమీదట కనిపించదు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. నిజంగానే ప్రేమ ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పేస్తుందా అన్న వార్త ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..

ప్రేమ సీరియల్ నుంచి తప్పుకుంటుందా..? 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ పాత్రలో నటిస్తుంది కన్నడ హీరోయిన్ లావణ్య.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. కన్నడ హీరోయిన్ అంటే ఎవరు నమ్మరు అచ్చ తెలుగు అమ్మాయిలాగా తెలుగు సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తుంది.. ఈ సీరియల్ ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఎందుకంటే ఈ సీరియల్లో మెయిన్ హీరోయిన్ ఎవరు అంటే ప్రేమ. స్టోరీ మొత్తం ఈ ప్రేమ పాత్ర చుట్టే తిరుగుతుందని ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ ను చూస్తే అర్థమవుతుంది. అలాంటి కీలకమైన పాత్రలో నటిస్తున్న ప్రేమ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్త సంచలనంగా మారింది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే వైరల్ అయింది. అసలు ప్రేమ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణం కన్నడలో ఆమెకి వరుసగా సినిమా అవకాశాలు కూడా రావడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు కన్నడలో సీరియల్స్ సినిమాలు ఎక్కువగా ఆమెకు రావడం వల్లే తెలుగులో సీరియల్ మానేయాలని అనుకున్నట్లు టాక్.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ప్రేమ రెస్పాండ్ అయ్యి అసలు విషయం ఏంటో చెప్పేంతవరకు ఈ సస్పెన్స్ తో వెయిట్ చేయాల్సిందే..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

ఈవారం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు కాస్త ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు శ్రీవల్లి బాగోతం గురించి కేవలం తోడుకోడలైన ప్రేమ నర్మదలకు మాత్రమే తెలుసు. కానీ రీసెంట్ ఎపిసోడ్లో వేదవతి కూడా వల్లి బాగోతం గురించి తెలిసిపోతుంది. తనకు తెలుసన్న నిజాన్ని ఎక్కడ బయట పెట్టకుండా వల్లిని చంపలు వాయిస్తూ ఒక ఆట ఆడుకుంటుంది. ప్రేమ నర్మదలు మాత్రం వల్లి వాయిస్ నోట్ ని అందరికీ వినిపించి అడ్డంగా ఇరికించాలని అనుకుంటారు. దాన్ని అడ్డుపెట్టుకొని ఒక ఆట ఆడుకుంటారు. మళ్లీ స్కూల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వల్లికి రావడంతో నానా తంటాలు పడుతూ ఉంటుంది.. ఇక వల్లికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని ప్రేమ నర్మదలు ఫిక్స్ అవుతారు.. ధీరజు అమూల్య విషయంలో ప్రేమకు దూరమైన విషయం తెలిసిందే.. ప్రేమ మొండితనంతో మళ్లీ ధీరజ్ దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది ఇవాళ ఎపిసోడ్లో మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×