E-Paper
Advertisement

Romantic Movie OTT : మెంటలెక్కించే మెడికల్ కాలేజీ ప్రేమ… స్నేహితుల సరదాకు కొంప కొల్లేరు… ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా

Romantic Movie OTT : మెంటలెక్కించే మెడికల్ కాలేజీ ప్రేమ… స్నేహితుల సరదాకు కొంప కొల్లేరు… ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలోకి ఒక రొమాంటిక్ సినిమా స్ట్రీమింగ్ కివచ్చింది. ఈ కథ 2005వ సంవత్సరంలో తమిళనాడులో జరుగుతుంది. అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లో ప్రేమ ఎలా ఉండేదో ఈ చిత్రంలో చూపించారు. పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోయినా, ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 25 నిమిషాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. కథలో ఊహించని మలుపులు ఉంటాయి. హీరో కథ మొదట్లోనే జైల్లో ఉంటాడు. ఆ తరువాత జరిగే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘మాయా బింబమ్’ (Maayabimbum) 2026 జనవరిలో విడుదలైన ఒక తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా. కేజే సురేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాష్ నటరాజన్, జానకి, హరి రుద్రన్, రాజేష్ లీడ్ రోల్స్ లో నటించారు. కే.జె. సురేందర్ తన సొంత బ్యానర్ సెల్ఫ్‌స్టార్ ప్రొడక్షన్స్ మీద ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా 2026 మార్చి 27 నుండి Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమాలో హీరో జీవా (ఆకాష్ నటరాజన్) జైలులో ఉండటంతో ప్రారంభమవుతుంది. అతను అక్కడికి ఎలా వెళ్లాడు అనే అంశాన్ని ఫ్లాష్‌బ్యాక్ ద్వారా వివరిస్తారు. నిజానికి జీవా ఒక మిడిల్ క్లాస్ యువకుడు. మెడికల్ కాలేజ్ లో చదువుతుంటాడు. అతను జానకి అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె నర్సుగా పని చేస్తుంటుంది. అయితే జీవా స్నేహితులు నిరంతరం ఆడవారిని కేవలం ఒక వస్తువులా, శారీరక సుఖం ఇచ్చే సాధనంలా చర్చిస్తుంటారు. వాళ్ళ మాటల ప్రభావంతో, హీరోయిన్ సుమతి చూపించే నిజమైన కేరింగ్‌ను జీవా తప్పుగా అర్థం చేసుకుంటాడు.

ఈ తప్పుడు అవగాహనతో అతను ఆమె పట్ల ప్రవర్తించిన తీరు, చివరికి ఒక విషాదకరమైన సంఘటనకు దారితీస్తుంది. ఆ ఒక్క పొరపాటు వల్ల అతను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తను చేసిన ఆ ఒక్క తప్పు అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని, అతని ప్రేమను అతలాకుతలం చేస్తుంది. ఇంతకీ అతను చేసిన తప్పు ఏమిటి ? జైలుకు ఎందుకు వెళ్ళాడు ? ఈ కథకు క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  మనవళ్లకు కథలు చెప్పాల్సిన వయసులో ప్రేమ పాఠాలు… డెబ్బై ఏళ్ల వయసులో డ్యాన్స్ స్టెప్పులు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×