E-Paper
Advertisement

LG Wireless OLED TV: కొత్త వైర్‌లెస్ OLED టీవీలు లాంచ్ చేసిన ఎల్‌జీ.. 165Hz రిఫ్రెష్ రేట్, స్మార్ట్ ఏఐ‌తో సూపర్ డిజైన్

LG Wireless OLED TV: కొత్త వైర్‌లెస్ OLED టీవీలు లాంచ్ చేసిన ఎల్‌జీ.. 165Hz రిఫ్రెష్ రేట్, స్మార్ట్ ఏఐ‌తో సూపర్ డిజైన్
Advertisement

LG Wireless OLED TV| ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన 2026 టీవీల లైనప్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం మొదలుపెట్టింది. కొత్త మోడల్స్‌లో OLED evo, Micro RGB evo, వైర్‌లెస్ OLED వాల్‌పేపర్ టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు మెరుగైన బ్రైట్‌నెస్, కచ్చితమైన రంగులు, తెలివైన AI ప్రాసెసింగ్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. వీటితో ఇంట్లోనే మంచి సినిమా థియేటర్ ఫీల్ కలుగుతుంది.

OLED evo సిరీస్‌లో భారీ అప్డేట్స్

OLED evo లైనప్‌లో G6, C6, B6 సిరీస్ మోడల్స్ ఉన్నాయి. ఈ టీవీలు హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీతో వస్తాయి. ఇది సాధారణ OLED ప్యానెల్స్ కంటే 3.9 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్ ఇస్తుందని ఎల్‌జీ చెబుతోంది. అన్ని మోడల్స్‌లో కొత్త ఆల్ఫా11 AI ప్రాసెసర్ 4K జెన్ 3 ఉపయోగించారు. ఇది గత మోడల్స్ కంటే 5.6 రెట్లు మెరుగైన AI పర్‌ఫామెన్స్ ఇస్తుంది. AI డ్యుయెల్ 4K అప్‌స్కేలింగ్, హైపర్ బ్రైట్ బూస్టర్ టెక్నాలజీలు వీడియో క్లారిటీ, బ్రైట్‌నెస్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

మెరుగైన వ్యూ, ఆడియో ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఎల్‌జీ రిఫ్లెక్షన్ ఫ్రీ ప్రీమియం టెక్నాలజీ యాడ్ చేసింది. దీంతో మంచి లైటింగ్ ఉన్న గదుల్లో కూడా స్క్రీన్‌పై బ్రైట్‌నెస్ తగ్గించి స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది. OLED సహజమైన హై కాంట్రాస్ట్, వేగవంతమైన రెస్పాన్స్ టైమ్ ఇప్పటికీ ఉన్నాయి. ఆడియో విషయంలో డాల్బీ అట్మాస్ ఫ్లెక్స్‌కనెక్ట్, LG సౌండ్ సూట్ టెక్నాలజీలు ఇమ్మర్సివ్ సౌండ్ ఇస్తాయి. ఇవి సినిమా లాంటి ఫీలింగ్ ఇస్తాయి.

AIతో స్మార్ట్ ఫీచర్లు

ఈ టీవీలు webOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. AI కన్‌సీర్జ్, AI సెర్చ్, AI చాట్‌బాట్ వంటి ఫీచర్లు ఉపయోగించి టీవీని సులభంగా నియంత్రించవచ్చు. AI పిక్చర్, సౌండ్ విజార్డ్ ఆటోమేటిక్‌గా పిక్చర్, సౌండ్ సెట్టింగ్స్‌ను ఆప్టిమైజ్ చేస్తాయి. మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినితో ఇంటిగ్రేషన్ ఉంది. వాయిస్ ID ద్వారా పర్సనల్ ప్రొఫైల్స్ సృష్టించవచ్చు. LG షీల్డ్ భద్రతా ఫీచర్లు డేటాను రక్షిస్తాయి.

వైర్‌లెస్ OLED W6: కేబుల్స్ లేని స్లిమ్ టీవీ

Advertisement

OLED evo W6 మోడల్ అతి సన్నని వాల్‌పేపర్ టీవీగా రూపొందించారు. దీని మందం కేవలం 9mm మాత్రమే. జీరో కనెక్ట్ బాక్స్ ద్వారా వైర్‌లెస్‌గా వీడియో, ఆడియో ట్రాన్స్‌మిషన్ జరుగుతుంది. కేబుల్స్ అవసరం లేదు. ఇది 4K రిజల్యూషన్‌తో 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్‌కు తక్కువ లేటెన్సీ ఇస్తుంది. జీరో కనెక్ట్ బాక్స్ సైజును 35 శాతం తగ్గించారు. ఈ మోడల్ CES 2026లో అనేక అవార్డులు గెల్చుకుంది.

Micro RGB evo సిరీస్

ఎల్‌జీ కొత్త Micro RGB evo LCD టెక్నాలజీని ప్రవేశపెట్టింది. సాధారణ వైట్ LEDలకు బదులు RGB LEDలు ఉపయోగించారు. ఇది కలర్ కంట్రోల్, బ్రైట్‌నెస్‌ను బాగా మెరుగుపరుస్తుంది. ఇందులో కూడా ఆల్ఫా11 AI ప్రాసెసర్ ఉపయోగించారు. BT.2020, DCI-P3, అడోబ్ RGB వంటి కలర్ స్టాండర్స్‌లో 100% సర్టిఫికేషన్ ఉంది. ఈ సిరీస్ 100 ఇంచుల వరకు, అంతకంటే ఎక్కువ సైజుల్లో అందుబాటులో ఉంటుంది.

Also Read:  బడ్జెట్ ధరలో గేమింగ్ మజా.. అమెజాన్‌లో 16GB ర్యామ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్

ధరలు, లభ్యత

దక్షిణ కొరియాలో మార్చి 25 నుంచి ఈ టీవీల సేల్స్ ప్రారంభయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా త్వరలో లభ్యం అవుతాయి. OLED evo మోడల్స్ 42 ఇంచుల నుంచి 97 ఇంచుల వరకు ఉన్నాయి. G6 సిరీస్ ధర KRW 30,59,700 (భారత కరెన్సీలో రూ.1,91,737) నుంచి KRW 3,79,00,000 (రూ.23,75,020) వరకు ఉంది. C6 సిరీస్ KRW 18,97,200 (రూ.1,18,888) నుంచి KRW 61,90,000 (రూ. 3,87,899) వరకు ఉంది. W6 వైర్‌లెస్, Micro RGB మోడల్స్ 2026లో జూలై తరువాత లాంచ్ అవుతాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×