E-Paper
Advertisement

ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన అషు రెడ్డి.. అసలైన ట్విస్ట్ ఇదేకదా!

ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన అషు రెడ్డి.. అసలైన ట్విస్ట్ ఇదేకదా!
Advertisement

Ashu Reddy:సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. నిన్న మొన్నటి వరకు తనపై ఉన్న చీటింగ్ కేసుతో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ, సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు అషుకి నిశ్చితార్థం అయిపోయిందా? ఆ వ్యక్తి ఎవరు? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్న సమయంలో, తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు రివీల్ అయ్యింది. ఆ వివరాలు చూద్దాం..

జూనియర్ సమంత నుంచి బిగ్ బాస్ వరకు:

అషురెడ్డి ప్రయాణం చిన్న వీడియోలతో మొదలైంది. సమంత పోలికలతో ఉండటంతో ఆమెకు “జూనియర్ సమంత”గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా హైప్ తీసుకొచ్చింది. అప్పటి నుండి గ్లామర్ ఫోటోషూట్లు, రీల్స్‌తో అషూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

వివాదంలో అషూ రెడ్డి.. 9 కోట్ల కేసు:

Advertisement

అయితే కెరీర్ బాగున్న సమయంలోనే అషు రెడ్డి ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషు రెడ్డి మరియు ఆమె తల్లి రూ. 9.35 కోట్లు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరినప్పటికీ, న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎంగేజ్‌మెంట్ ఫోటోల గోల:

ఈ కేసు గొడవ జరుగుతుండగానే, అషు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఒక వ్యక్తితో ఉంగరాలు మార్చుకుంటున్నట్టు ఉండటంతో, అందరూ ఆమె పెళ్లి చేసేసుకుంటోందని నమ్మేశారు. అయితే ఆ ఫోటోల్లో వరుడి మొహం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో అషును ఉక్కిరిబిక్కిరి చేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోయారు.

అసలైన ట్విస్ట్ ఇదే:

Advertisement

చివరికి ఈరోజు అషు ఆ ఫోటోల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఆ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నిజమైనవి కావు, అవి ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ (VOD) అనే వెబ్ సిరీస్ షూటింగ్ లోని సీన్స్ అని తేల్చి చెప్పింది. ఆ సీన్‌లో ఆమెతో ఉన్నది మరెవరో కాదు, బుల్లితెర నటుడు నిఖిల్ మలియక్కల్. “కంటికి కనిపించేవన్నీ నిజం కావు.. గుడ్డిగా నమ్మకండి” అంటూ ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ కోసం సిద్ధమవుతున్న విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ లో భాగంగా ఇలా నిఖిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీడియోని ఇప్పుడు షేర్ చేసింది.

సారీ చెప్పిన అషు:

జనాలని అటెన్షన్ కోసమే ఇలా చేశానంటూ అషు రెడ్డి తన పోస్ట్‌లో సారీ చెప్పింది. “జనాలు దేనినైనా ఎలా నమ్ముతారు,అందరి కళ్ళు ఆకర్షించడానికి విషయాలను ఎలా రంగులు అద్ది చూపిస్తారో చెప్పడానికే నేను ఇలా చేశాను.. దయచేసి అర్థం చేసుకోండి” అని ఆమె క్లారిటీ ఇచ్చింది. దీంతో అషుకి పెళ్లి కాలేదని తెలిసి ఆమె అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

మొత్తానికి అషు రెడ్డి మరోసారి తన స్టైల్‌లో పబ్లిసిటీ ఎలా చేయాలో నిరూపించింది. ఒకవైపు సీరియస్ కేసు నడుస్తున్నా, మరోవైపు తన ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం ఇలాంటి ప్లాన్ వేయడం విశేషం.ఇక ఏది ఏమైనా, అషూ ఇచ్చిన ఈ ట్విస్ట్ మాత్రం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

also read:సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మృతి.. అసలేమైందంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×