E-Paper
Advertisement

శాంసంగ్ సంచలనం.. ఇంటిని థియేటర్‌లా మార్చే.. సరికొత్త ఏఐ టీవీలు వచ్చాయోచ్!

శాంసంగ్ సంచలనం.. ఇంటిని థియేటర్‌లా మార్చే.. సరికొత్త ఏఐ టీవీలు వచ్చాయోచ్!
Advertisement

Samsung TVs: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ సరికొత్త టీవీలను లాంచ్ చేసింది. తన లేటెస్ట్ విజన్ AI పవర్డ్ మినీ ఎల్ఈడీ (Vision AI-powered Mini LED) టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 43 అంగుళాల నుంచి 100 అంగుళాల మధ్య ఉన్న ఈ టీవీలు.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రూ.42,990 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ఏఐ టీవీల ప్రత్యేకతలు, ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రధాన ఫీచర్లు ఏంటంటే?

శాంసంగ్ ఈ ఏఐ మినీ ఎల్ఈడీ టీవీల్లో పవర్ ఫుల్ ఎన్ క్యూ4 ఏఐ జెన్ 2 (NQ4 AI Gen2) ప్రాసెసర్ ను అమర్చింది. ఇది రియల్ టైమ్ పిక్చర్, సౌండ్ ఆప్టిమైజేషన్ కోసం 20 న్యూరల్ నెట్ వర్క్ ఆర్కిటెక్చర్ ను ఉపయోగిస్తుంది. ఇందులోని ఏఐ సౌండ్ కంట్రోల్.. యూజర్లకు బెస్ట్ మ్యూజిక్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

గేమర్స్‌కు పండుగే..

Advertisement

ఇందులో గేమర్స్ కోసం ప్రత్యేకంగా మోషన్ ఎక్సిలరేటర్ 144హెచ్ జెడ్ (Motion Xcelerator 144Hz) టెక్నాలజీని అందించారు. స్క్రీన్ పై విజువల్స్ చాలా వేగంగా కదిలినప్పటికీ స్పష్టంగా.. ఎలాంటి బ్లర్ లేకుండా చూసేందుకు సాయపడనుంది. ఇక ఈ ఏఐ టీవీలకు.. శాంసంగ్ 7 ఏళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్స్ అందించనున్నట్లు ప్రకటించింది. తద్వారా యూజర్లు ఎక్కువ కాలం పాటు లేటెస్ట్ ఫీచర్లను పొందొచ్చని పేర్కొంది.

సెక్యూరిటీ ఫీచర్లు..

మరోవైపు డేటా రక్షణ కోసం ఇందులో శాంసంగ్ నాక్స్ సెక్యురిటీ (Samsung Knox Security) ఫీచర్ ను అందించారు. అలాగే స్మార్ట్ థింగ్స్ యాప్ ను ఉపయోగించి.. ఈ టీవీని కంట్రోల్ చేసే వెసులుబాటును సైతం శాంసంగ్ కల్పించింది. మరోవైపు ఈ ఏఐ ఎల్ఈడీ టీవీలను మెటల్ స్ట్రీమ్ డిజైన్ తో శాంసంగ్ తీసుకొచ్చింది. ఇవి చాలా స్లిమ్ గా ఉంటూ ప్రీమియం లుక్ ను అందిస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Also Read: Honeycomb vs Wood Wool: ఏసీ లాంటి చల్లదనం కావాలా? అయితే ఈ రెండు కూలర్లలో.. ఏది బెస్ట్ అంటే?

టీవీలపై లాంచ్ ఆఫర్లు

శాంసంగ్ ఈ ఏఐ మినీ ఎల్ఈడీ టీవీలపై లాంచింగ్ ఆఫర్లను సైతం ప్రకటించింది. ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తే టీవీ ధరపై 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా ఎలాంటి డౌన్ పేమేంట్ లేకుండా 30 నెలల పాటు ఈఎంఐ సౌకర్యాన్ని సైతం ఆఫర్ చేస్తోంది. కాబట్టి రూపాయి కట్టకుండానే ఈ టీవీని తీసుకెళ్లే వెసులుబాటు కస్టమర్లకు లభించనుంది.

Also Read: Tamil Nadu Politics: సీఎం కాకముందే.. విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న చిన్నపార్టీలు..!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×