E-Paper
Advertisement

తమిళ రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు భారీ గుడ్‌న్యూస్, టీవీకేకు మద్ధతు ప్రకటించిన వీసీకే

తమిళ రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు భారీ గుడ్‌న్యూస్, టీవీకేకు మద్ధతు ప్రకటించిన వీసీకే
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు ముగిసింది. ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం టీవీకే ఎదురుచూస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటిస్తూ అధికారికంగా లేఖ సమర్పించింది. వీసీకే అధినేత తిరుమావళవన్ పంపిన ఈ మద్దతు లేఖను టీవీకే నాయకుడు ఆదవ అర్జున స్వీకరించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును చేరుకోవడంతో విజయ్ క్యాంప్‌లో జోష్ పెరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు తమ మద్దతును తెలిపాయి. ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో టీవీకే కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ అయిన 118కి చేరుకుంది. దీనితో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం ఇప్పుడు విజయ్ రూపంలో సరికొత్త మలుపు తిరిగింది.

Advertisement

తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ కాసేపట్లో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 10వ తేదీతో ముగియనుండటంతో ఈలోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. గవర్నర్ నుంచి అధికారికంగా ఆహ్వానం అందిన వెంటనే విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ అనుమతి లభించిన వెంటనే విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సినీ రంగంలో తిరుగులేని నటుడిగా వెలుగొందిన విజయ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.

Advertisement

ALSO READ: దెశమంతా తిరుగుతా.. మోదీని గద్దె నుంచి దింపుతా, వీహెచ్ సంచలన ప్రకటన

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×