E-Paper
Advertisement

Arjun Kalyan: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి అదే కారణమా.. అసలు మ్యాటర్ చెప్పిన అర్జున్!

Arjun Kalyan: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి అదే కారణమా.. అసలు మ్యాటర్ చెప్పిన అర్జున్!
Advertisement

Arjun Kalyan: అర్జున్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా సీరియల్స్ లోను అలాగే బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని మరింత ఆధారాభిమానాలను సొంతం చేసుకున్న  సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్  ఎలాంటి కొత్త సీరియల్స్ కు కమిట్ అవ్వకపోయిన బిబి జోడి సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన అతను సీరియల్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

హీరోయిన్ వల్లే సీరియల్ ఆగిపోయిందా..

అర్జున్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి సీరియల్ నువ్వుంటే నా జతగా(nuvvunte naa jathaga). స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సీరియల్ లో అర్జున్ కు జోడిగా అనుమితా దత్తా (Anumita Dutta) హీరోయిన్ గా నటించారు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని అద్భుతమైన రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఉన్నఫలంగా ఆగిపోయింది. ఇలా ఈ సీరియల్ ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటూ అభిమానులు కూడా ఎంతో నిరాశ చెందారు.

కథ నచ్చకపోవడంతో హీరోయిన్ తప్పుకుంది..

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కళ్యాణ్ ఈ సీరియల్ ఆగిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సీరియల్ ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరోయిన్ అని తెలుస్తుంది. ఈ సీరియల్ కథ మొత్తం మార్చేయడంతో హీరోయిన్ తాను నటించనని తేల్చి చెప్పారు. దీంతో సీరియల్ ఆగిపోయిందని తెలిపారు. దర్శక నిర్మాతలు అనుకున్న కథ ప్రకారం దేవ్ జైలుకు వెళ్లే సమయంలో మిధున ప్రెగ్నెంట్ అయి ఉంటుంది . ఐదు సంవత్సరాల తర్వాత అంటూ మరొక కొత్త కథను క్రియేట్ చేశారు. అయితే ఆ కథ నచ్చని హీరోయిన్ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు. అయితే వేరే రెండు కథలను కూడా సిద్ధం చేశారు కానీ ఆ కథలతో ఎవరు సాటిస్ఫై కాలేదని తెలిపారు.

బ్రహ్మానందం గారు కూడా మా సీరియల్ చూస్తారు..

Advertisement

ఇక ముందుగా అనుకున్న కథ ఫైనల్ చేసి హీరోయిన్ ని మార్చాలని ప్రయత్నాలు కూడా చేశారు . నేను బిబి జోడి 2 కార్యక్రమంలో బిజీగా ఉన్నాను అయితే ఈ షూటింగ్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఒక్కసారిగా నాకు సీరియల్ ఆపేస్తున్నాము అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఉన్నపలంగా సీరియల్ ఆగిపోవడంతో చాలా ఫీల్ అయ్యానని అర్జున్ తెలిపారు. అయితే ఈ సీరియల్ ఆగిపోవడంతో ప్రముఖ నటుడు బ్రహ్మానందం గారు కూడా ఈ సీరియల్ ఎందుకు ఆగిపోయిందని ఎంక్వైరీ చేశారని అర్జున్ తెలిపారు. బ్రహ్మానందం గారి లాంటి గొప్ప నటుడు కూడా మా సీరియల్ గురించి అడిగారంటే ఈ సీరియల్ కి ఎలాంటి క్రేజ్  ఉండేదో స్పష్టం అవుతుందని అర్జున్ తెలిపారు.

Also Read; Monalisa Bhosle: ఫైనల్లీ ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఫోటోలు వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×