E-Paper
Advertisement

Kissik Talks: తెలుగు ప్రేక్షకులను వదిలివెళ్లను, కానీ.. నటి లయ ప్రామిస్!

Kissik Talks: తెలుగు ప్రేక్షకులను వదిలివెళ్లను, కానీ.. నటి లయ ప్రామిస్!
Advertisement

Kissik Talks: లయ.. ఈ పేరు అందరికీ పరిచయమే. టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి మంచి పాత్రలు చేసి.. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ని అందుకున్న లయ (Actress Laya), కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకుని, తన భర్త జాబ్ నిమిత్తం అమెరికా వెళ్లిపోయారు. అక్కడే భర్త, పిల్లలతో ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ.. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన లయ, మళ్లీ రీసెంట్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ రీ ఎంట్రీలో ఆమెకు అద్భుతమైన పాత్రలు పడుతున్నాయి. ఈ పాత్రలతో తను హ్యాపీగా ఉన్నట్లుగా తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్‌ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, ఇకపై టాలీవుడ్ ప్రేక్షకులను వదిలి వెళ్లనని ప్రామిస్ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో లయ మాట్లాడుతూ..

Also Read- Monalisa Bhosle Wedding:  ఫైనల్లీ ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఫోటోలు వైరల్!

ప్రామిస్ చేస్తున్నా..

Advertisement

‘‘తెలుగు ప్రేక్షకులను, ఆడియెన్స్‌ను వదిలి వెళ్లనని ప్రామిస్ చేస్తున్నాను. కానీ, మా ఫ్యామిలీని చూసుకోవడానికి మాత్రం అప్పుడప్పుడు వెళ్తాను’’ అని లయ ప్రామిస్ (Laya Promise) చేశారు. టాలీవుడ్‌లో ఆమె కోసమని ప్రత్యేకంగా దర్శకులు పాత్రలు రాస్తున్నారు. ప్రస్తుతం అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలు పోషించే నటులు చాలా వరకు తక్కువయ్యారు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి, ఇంతకంటే సీనియర్ నటి దర్శకులకు దొరుకుతుందా? అందునా తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను వదులుకోరు. ఎందుకంటే, తెలుగు ఆర్టిస్ట్‌లు తక్కువైపోతున్న ఈ రోజుల్లో తెలుగు మాట్లాడుతూ, చక్కని చీర కట్టుతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే లయని, ఎవరు మాత్రం ఇష్టపడరు? చెప్పండి. అందుకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే కాకుండా, ఆమెపై ప్రధాన పాత్రలను కూడా క్రియేట్ చేస్తున్నారు.

Also Read- EK DIN Trailer: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే?

అప్పుడేం తెలిసేది కాదు..

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ మొదట్లో చేసిన బ్లైండ్ పాత్ర గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో నాకు ఎవరూ చెప్పేవారు లేరు. నా ఏజ్ కూడా అప్పుడు చాలా తక్కువ. 18 లేదంటే 19 ఉంటాయి. ఒక కమర్షియల్ హీరోయిన్‌గా వెళ్లాలనుకున్నప్పుడు.. మీరు ఆర్ట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తారేంటి? అని నా ముందే అనేవాళ్లు. అదేంటి అందరూ ఇలా అంటున్నారు. ఈ ఎఫెక్ట్ నా నెక్ట్స్ సినిమాలపై కూడా ఉంటుందా? అని అనుకునేదాన్ని. ఇలాంటివేమీ అప్పుడు నాకేం అర్థమయ్యేవి కావు’’ అని అన్నారు. నిజమే, ఆర్ట్స్ ఫిల్మ్స్ పేరును తెచ్చిపెడతాయి కానీ, కమర్షియల్ సక్సెస్‌ను ఇవ్వలేవు. అందునా, యంగ్ హీరోయిన్స్‌, కెరీర్ ప్రారంభంలోనే అలాంటి పాత్రలు చేస్తే.. ఆ తర్వాత అన్నీ అలాంటి పాత్రలే పడతాయి. లయకు కమర్షియల్‌ హీరోయిన్ పేరు రాకపోవడానికి కారణం ఇదేనని చెప్పుకోవచ్చు.

Also Read- Mad For Each Other Promo: మా కోసం ఎవ్వరూ రారు అని ఏడ్చేసిన నూకరాజు..అమ్మాయి వల్ల భార్యను దూరం పెట్టిన నటరాజ్ మాస్టర్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×