E-Paper
Advertisement

Virosh: ఆనంద్ దేవరకొండ పాటకు విజయ్ – రష్మిక డాన్స్.. అన్న, వదినను చూసి తెగ ఆనందపరడిపోయిన మరిది..!

Virosh: ఆనంద్ దేవరకొండ పాటకు విజయ్ – రష్మిక డాన్స్.. అన్న, వదినను చూసి తెగ ఆనందపరడిపోయిన మరిది..!
Advertisement

Virosh: విజయ్ దేవరకొండ.. రష్మిక మండన్న పెళ్లి ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకల్లో ఒక ప్రత్యేకమైన వీడియోను హీరో ఆనంద్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నతో కలిసి ఆనంద్ దేవరకొండ డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ముగ్గురు కలిసి చేసిన డాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆనంద్ దేవరకొండ పాటకి అన్న, వదిన స్టెప్పులు..!

Advertisement

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ నుండి వచ్చిన మొదటి పాట సంచారమేకు వీరు డాన్స్ చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు. పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఇలా సరదాగా గడిపిన ఈ క్షణాలు చాలా సహజంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ దేవరకొండ తన క్యాప్షన్‌లో కూడా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. “ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

?igsh=MTU1Zmh4OGN0NTIxaA==

“సంచారమే ఎంత బాగుంది… దీనికన్నా ఆనందం ఏముంది” అంటూ పాట లిరిక్స్‌ను కూడా ఆయన క్యాప్షన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో అభిమానుల మధ్య మరింత వైరల్ అయింది.

ఈ సంచారమే పాటను ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న రాశారు. సంగీతం మరియు గానం హేశం అబ్దుల్ వహాబ్ చేశారు. ఈ పాట లండన్‌లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరించబడింది. విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఈ సినిమా కథలో చూపించబోతున్నారు.

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ సినిమా తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటించడం కూడా అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఇక కుటుంబ వేడుకల్లో విజయ్, రష్మికతో కలిసి ఆనంద్ దేవరకొండ చేసిన ఈ సరదా డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అభిమానులు కూడా ఈ వీడియోను చూసి “ఇది నిజమైన ఫ్యామిలీ ఆనందం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: Harish shankar: ఆ హీరోని ఏమైనా అంటే కళ్ళు పోతాయి.. వివరణ ఇచ్చిన హరీష్ శంకర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×