E-Paper
Advertisement

Anchor Suma: ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కష్టాలను బయటపెట్టిన సుమ!

Anchor Suma: ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కష్టాలను బయటపెట్టిన సుమ!
Advertisement

Anchor Suma: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సుమ కనకాల(Suma Kanakala) ఒకరు. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంతోమంది యాంకర్లుగా పరిచయం అవుతూ మంచి సక్సెస్ అందుకున్న సుమ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు సీరియల్ నటిగా ప్రేక్షకులను అలరించిన సుమ అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమా ఈవెంట్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

సుమ ఉంటే ఈవెంట్ సక్సెస్..

ఒక సినిమా పూజా కార్యక్రమాల నుంచి మొదలుకొని ఆ సినిమా సక్సెస్ మీట్ వరకు సుమ ప్రమేయం ఉంటుందని చెప్పాలి. ఇక సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేస్తారు. అందుకే సుమ యాంకర్ గా ఉండాలని ఎంతోమంది హీరోలు దర్శక నిర్మాతలు కూడా కోరుకుంటూ ఉంటారు.. ఇక వేదికపై సుమ తన మాట తీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు ఒక ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు అంటే దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుందని సుమ తెలిపారు.

రెండు రోజుల నుంచి ప్రిపేర్ అవుతా..

Advertisement

తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఈ విషయాలను బయటపెట్టారు. మనం ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తే ముందుగా షూట్ చేసి ఆ తర్వాత ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తారు కానీ ఒక ఆడియో లాంచ్ లేదా ఈవెంట్ లైవ్ ఉంటే మనం అక్కడ ఏం చేస్తున్నామో అది మొత్తం అందరూ చూస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తానని సుమ తెలిపారు. తాను ఒక షెడ్యూల్ ప్రిపేర్ అయ్యి ఉంటాను ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే షెడ్యూల్లో ఉన్నవాళ్లు కాకుండా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు అలాంటప్పుడు వాటిని నా మైండ్ లోకి తీసుకొని నన్ను నేను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఇలా ఒక ఈవెంట్ ఉంది అంటే రెండు రోజుల ముందు నుంచి తాను షెడ్యూల్స్ అన్ని రాసుకొని బాగా ప్రిపేర్ అవుతానని అలా ప్రిపేర్ అయినప్పుడే సక్సెస్ ఫుల్ గా ఈవెంట్ పూర్తి అవుతుందని సుమ తెలిపారు. యాంకరింగ్ లో నాకు ఇన్నేళ్ల అనుభవం ఉన్నప్పటికీ తాను ఈవెంట్ ముందు కచ్చితంగా ప్రిపేర్ అవుతానని ఈవెంట్ వెనుక కష్టాల గురించి తెలియజేశారు. ఇలా ఒకప్పుడు నటిగా ప్రేక్షకులను మెప్పించిన సుమ, ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. యాంకరింగ్ తో పాటు మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన ప్రేమంటే సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో సుమ నటించి సందడి చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Anchor Suma: ఇండస్ట్రీలో నేనెవరిని తొక్కేయలేదు.. ఆ యాంకర్ కు సుమ కౌంటర్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×