E-Paper
Advertisement

Anchor Suma: ఇండస్ట్రీలో నేనెవరిని తొక్కేయలేదు.. ఆ యాంకర్ కు సుమ కౌంటర్!

Anchor Suma: ఇండస్ట్రీలో నేనెవరిని తొక్కేయలేదు.. ఆ యాంకర్ కు సుమ కౌంటర్!
Advertisement

Anchor Suma: సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో సుమ కనకాల(Suma Kanakala) ఒకరు. ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినా స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ తన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ ఎలాంటి తప్పులు దొర్లకుండ ఎంతో విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అందుకే సుమ తమ సినిమాలకు యాంకర్ గా ఉండాలని ప్రతి ఒక్క దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ సుమకు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈమె గురించి గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

యాంకరింగ్ సిండికేట్..

సుమ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటం కోసం కొంతమందిని తొక్కేస్తున్నారని ఇండస్ట్రీలో పెద్ద సిండికేట్ నడుస్తుంది అంటూ ఉదయభాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సుమ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే అంశం గురించి ప్రస్తావనకు రావడంతో తాను తన స్వశక్తితోనే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానని , తాను సక్సెస్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి రాకుండా ఎవరిని అడ్డుకోలేదని తెలిపారు. తానే కొత్తగా వచ్చే వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తుంటానని, ఇక దర్శక నిర్మాతలకు కూడా నాకు కుదరదు ఎవరికైనా అవకాశం ఇవ్వండి అంటూ నేనే చెబుతూ ఉంటాను అంటూ సుమ తెలియజేశారు.

నేనెవరికీ అడ్డుపడలేదు..

Advertisement

ఇలా ఇండస్ట్రీలో నేనెవరికీ అడ్డుపడలేదు అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ కచ్చితంగా మరొక యాంకర్ ఉదయభాను కు కౌంటర్ ఇచ్చిన విధంగానే ఉన్నాయి. ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లేకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు అంటూ గతంలో ఉదయభాను ఒక వేదికపై ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇండస్ట్రీలో ఎవరు ఎవరిని అడ్డుకోరని, ఎవరి టాలెంట్ వాళ్లు ఉపయోగించుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. సుమ గత కొంతకాలంగా యాంకరింగ్ రంగంలో ఉన్న నేపథ్యంలో యాంకరింగ్ పట్ల అవగాహన కల్పించడం కోసం మాస్టర్ క్లాసెస్ కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

ఇలా ఇండస్ట్రీకి కొత్తవాళ్లు ఎంతమంది వస్తున్నా సుమా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. మరి ఇండస్ట్రీకి సుమ రిటైర్మెంట్ ఎప్పుడనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు సుమా సమాధానం చెబుతూ నాకు రిటైర్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు. తాను చివరి వరకు ఇండస్ట్రీలోనే కొనసాగుతానని ఈ యాంకరింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలే లేవని మరోసారి తెలియజేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త వాళ్లు యాంకర్లుగా అడుగుపెట్టి వారికంటూ మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చిన యాంకర్ అంటేనే అందరికీ సుమ గుర్తుకు రావడంతో సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

Also Read: Anchor Suma: నా జీవితంలో ఆ షో ఎప్పటికీ ప్రత్యేకమే..సుమ మనసును గెలిచిన షో..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×