E-Paper
Advertisement

Ye Devi Varamo Neevu Sanjana : ‘ఏ దేవి వరమో నీవు’ సంజన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Ye Devi Varamo Neevu Sanjana : ‘ఏ దేవి వరమో నీవు’ సంజన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement

Ye Devi Varamo Neevu Sanjana : ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి బిజీగా మారారు కొందరు హీరోయిన్లు.. ప్రస్తుతం బుల్లితెర పైకి ఎంట్రీ ఇస్తున్నారు.. ప్రముఖ చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను నిత్యం తమ నటనతో అలరిస్తూ వస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు సీరియల్స్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కొత్త సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు.. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంజన గల్రానీ..

స్టార్ మా లో త్వరలో ప్రసారం కాబోతున్న ఏ దేవి వరమో నువ్వు అనే సీరియల్ ద్వారా ఈమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేసింది.. ఆ సీరియల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈమె ఇప్పుడు సీరియల్ లో తల్లి పాత్రలో నటించబోతుంది.. మరి ఈ పాత్రకు గాను ఆమె రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఒక రోజుకి సంజన రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో కాస్త వివరంగా తెలుసుకుందాం..

సీరియల్ కోసం సంజన రెమ్యూనరేషన్..? 

Advertisement

ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్లుగా నటించిన చాలామంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు సీరియస్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ ద్వారా మరోసారి స్క్రీన్ మీద కనిపించిన సంజన ఇప్పుడు బుల్లితెరపై కనిపించబోతుంది. ఈమె నటించిన కొత్త సీరియల్ ఏ దేవి వరము నువ్వు.. అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఇందులో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటిస్తుంది. బిగ్బాస్ తర్వాత ఈమెకు డిమాండ్ ఎక్కువగానే ఉండడంతో ఈ సీరియల్కు రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు.. నిజానికి ఈమెకు ఒక రోజుకి దాదాపు 50 వేల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. డైలీ సీరియల్స్ డైలీ ఉంటాయి కాబట్టి ఈమెకు నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వెండితెరపై క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకుంటారో చూడాలి..

సీరియల్ ప్రోమో విషయానికొస్తే.. 

ఇది మలయాళంలో మళతోరుం మున్పే అనే సీరియల్‌కి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో ని స్టార్ మా ఛానల్ ఇటీవలే ప్రచారం చేసింది. ప్రోమోకి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఉప్పెన సీరియల్ నటి సోనియా ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తుంది.. హీరోయిన్ కి అమ్మ పాత్రలో సంజన కనిపించబోతుంది. అనాథ శరణాయలం.. అక్కడ 25 ఏళ్లు పెరిగిన అమ్మాయి.. ఆ అమ్మాయి గతం చుట్టూ ఈ కథ తిరిగేలా ఉంది. ఒక మహారాణి లాగా ఆ అనాధశ్రమంలో ఆ హీరోయిన్ ని చూపించారు.. నీకంటూ ఒక కుటుంబం ఉంది నువ్వు ఆ అడ్రస్ కి వెళ్ళు అని అనాధాశ్రమంను నడుపుతున్న ఒక వృద్దురాలు చెబుతుంది. ఆమె మాట ప్రకారం హీరోయిన్ తన తల్లిని కలుసుకోవడానికి వెళుతుంది. మరి తల్లి కూతుర్లు కలుస్తారా? లేదా? అన్నది ఈ సీరియల్ లో చూడాల్సిందే…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×