E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 1st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : మనోహరిని కొట్టిన మిస్సమ్మ   

Nindu Noorella Saavasam Serial Today Episode May 1st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : మనోహరిని కొట్టిన మిస్సమ్మ   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బ్లడ్‌ శాంపిల్స్‌ మిస్‌ అయ్యాయని మనోహరి బాధపడుతుంటే అప్పుడే రూంలోకి వెళ్లిన మిస్సమ్మ కోపంగా మనోహరి అంటూ అరుస్తుంది. తిరిగి చూసిన మనోహరి షాకింగ్‌ గా ఉంటే.. దగ్గరకు వెళ్లిన మిస్సమ్మ కోపంగా ఏంటి నువ్వు చేసిన పని అంటూ మనోహరి చెంప మీద కొడుతుంది. దీంతో మనోహరి కోపంగా నా మీదే చేయి చేసుకుంటావా..? ఇందాకా ఆ సరస్వతి కొట్టింది ఇప్పుడు నువ్వు అంటూ తిడుతుంటే.. మిస్సమ్మ కోపంగా నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు నిన్ను ఏం చేసినా పాపం లేదు అనగానే.. మనోహరి నేనేం చేశాను అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ కోపంగా స్కూల్‌ లో అంజు బ్లడ్‌ శాంపిల్‌ ఎందుకు తీసుకున్నావు అని అడగ్గానే.. మనోహరి షాక్‌ అవుతుంది.

నేను శాంపిల్స్‌ తీసుకోవడం ఏంటి..? నాకేంటి అవసరం అనగానే.. మిస్సమ్మ కోపంగా నాకు అంతా తెలుసు.. తప్పించుకోలేవు.. నిజం చెప్పు అనగానే.. మనోహరి భయంగా అంజు రణవీర్ కూతురేమోనని టెస్ట్‌ చేస్తే తెలిసిపోతుంది కదాని బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నాను అని చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా అంజు రణవీర్‌ కూతురైతే నీ కూతురు కాదా..? నువ్వు వాడి భార్యవే కదా? వాడితో కలిసి నువ్వు వదిలేసిన బిడ్డనే కదా మీరు వెతుకుతున్నారు..? అని చెప్పగానే.. మనోహరి ఆ బిడ్డతో రణవీర్‌కు చాలా పనుంది అని చెప్పగానే.. మిస్సమ్మ తెలుసు.. బిడ్డతో  రణవీర్‌కున్న పనేంటో నాకు తెలుసు.. బిడ్డ దొరికాక రణవీర్‌ ఏం చేస్తాడో తెలుసు. బిడ్డ దొరక్కపోతే రణవీర్‌ నిన్ను ఏం చేస్తాడో తెలుసు. అందుకే కదా ఆ బిడ్డ కోసం అంతలా వెతుకుతున్నావు. తప్పు చేస్తున్నావు మనోహరి ఈ విషయం ఆయనకు తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు.. అనగానే..

Advertisement

మనోహరి నా బిడ్డ కోసం నేను వెతికితే తప్పా..? అనగానే.. మిస్సమ్మ ఫస్ట్‌ టైం నా బిడ్డ అన్నట్టున్నావు. అప్పుడు బిడ్డను వదిలేయడం ఎందుకు ఇప్పుడు వెతకడం ఎందుకు..? అని ప్రశ్నించగానే.. మనోహరి కోపంగా అదంతా నీకు అనవసరం అంటుంది. దీంతో మిస్సమ్మ ఓకే కానీ మీరు అంజు జోలికి రావొద్దు. మీరు వెతుకుతున్న బిడ్డ అంజు కాదు.. అని చెప్పగానే.. మా బిడ్డ అంజు కాదని నువ్వెలా చెప్తున్నావు అంటూ మనోహరి ప్రశ్నించగానే.. మిస్సమ్మ కోపంగా ఎలా ఏంటి..? నేను ఆయన భార్యను ఆ అయిదు మంది పిల్లలు మా పిల్లలే అని చెప్పగానే.. మనోహరి నమ్మమంటావా..? అనగానే.. మిస్సమ్మ నమ్మకు నేను ఈ విషయం ఆయనతో చెప్తాను ఆ తర్వాత నీ ఇష్టం అంటూ మిస్సమ్మ వెళ్లిపోతుంది. మనోహరి ఇరిటేటింగ్‌గా అంజు నా కూతురు కాదని చెప్తుంది. అంజు కాకపోతే ఇంకెవరు… అనుకుంటుంది.

మిస్సమ్మ, అమర్‌ రూంలోకి వెళ్లగానే.. రూంలో అమర్‌ లగేజీ సర్దుకుంటూ ఉంటాడు. మిస్సమ్మ ఏంటండి లగేజీ సర్దుకుంటున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు అని అడగుతుంది. దీంతో అమర్‌ చిన్న పని ఉంది రెండు రోజుల్లో వస్తాను అంటాడు. దీంతో మిస్సమ్మ పిల్లలకు ఎగ్జామ్స్‌ ఉన్నాయి కదండి ఈ టైంలో మీరు లేకపోతే అని చెప్తుండగానే.. అమర్‌ నువ్వు ఉన్నావు కదా పిల్లలను దగ్గరుండి చదివించు అంటాడు. దీంతో మిస్సమ్మ మీరు ఉండటం వేరండి.. మీరు ఉంటే పిల్లలు బుద్దిగా క్రమశిక్షణగా ఉంటారు అని చెప్పగానే.. అమర్‌ నేను లేకపోయినా పిల్లలను క్రమశిక్షణగా చూసే బాధ్యత నీది అంటాడు.

Advertisement

అప్పుడే మిస్సమ్మ కన్ను అదురుతుంది. దీంతో మిస్సమ్మ ఇదేంటి అపశకునంగా కన్ను అదురుతుంది. ఈయనేమో పిల్లలను తాను లేకపోయినా భద్రంగా చూసుకోమని చెప్తున్నారు.. అని మనసులో అనుకుంటూ ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్తున్నారండి అడగ్గానే.. అమర్‌ నన్ను ఇప్పుడేం అడగకు భాగీ తిరిగి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. పిల్లలకు స్కూల్‌ టైం అవుతుంది. వెళ్లి వాళ్లను రెడీ చేయ్‌ అని చెప్పగానే.. మిస్సమ్మ కిందకు వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×