E-Paper
Advertisement

Intinti Ramayanam Kamal : ‘ఇంటింటి రామాయణం ‘ కమల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడంటే..?

Intinti Ramayanam Kamal : ‘ఇంటింటి రామాయణం ‘ కమల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడంటే..?
Advertisement

Intinti Ramayanam Kamal : ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా నిజంగానే ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయి జీవించేశారు. గతంలో వాళ్ళు చేసిన సీరియల్స్ తో గుర్తుకురాకుండా నటించి మెప్పించారు. ఈ సీరియల్ ప్రతిరోజు కూడా స్టార్ మా లో ప్రసారమవుతుంది.. రాజేంద్రప్రసాద్ కుటుంబంలో మూడవ కొడుకుగా కమల్ నటించిన విషయం తెలిసిందే.. కమల్ అమాయకత్వం తింగరితనం వల్ల అందరూ తనని చిన్నపిల్లాడి లాగా చూసుకుంటారు. అలాంటి కమల్ రియల్ లైఫ్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.. కమల్ ఏం చదువుకున్నాడు..? ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేశాడో ఒకసారి ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం…

కమల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడు..?

ఇంటింటి రామాయణం సీరియల్ లో కమల్ పాత్రలో నటించిన నటుడి అసలు పేరు వరుణ్ రాజ్.. తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు బీటెక్ వరకు చదివాడు. తర్వాత చిన్న ఉద్యోగం కూడా చేశారు.. ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఇండస్ట్రీకి రావాలన్న కోరిక అతనిలో కలిగింది.. నటనపై ఆసక్తి కలగడంతో అటుగా అడుగులు వేశారు. సావిత్రి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. మొదటి సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రముఖ ఛానల్ ఈటీవీ లో ప్రసారమైన గంగోత్రి సీరియల్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఈ సీరియల్ కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో వరుణ్ రాజ్ క్రేజ్ ఇంకాస్త పెరిగిపోయింది. ప్రస్తుతం ఇంటింటి రామాయణంలో నటిస్తున్నారు. ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకుంది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది..

వరుణ్ రాజ్ ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..?

Advertisement

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఇందులో నటించిన కమల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందరినీ ఎప్పుడూ సరదాగా ఉంచాలని అనుకునేవాడు.. తన అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాడు. గతంలో నటించిన సీరియల్ లో మాత్రం తన నటన జనాలను మెప్పిస్తే. ఈ సీరియల్ తనకు మరో మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.. దాంతో రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నాడు.. ఒక్క సీరియల్ కి గాను ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఈ లెక్కన వరుణ్ నెలకి లక్షల్లోని సంపాదిస్తున్నాడు.. ఇక సోషల్ మీడియాలో వరుణ్ హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను, అలాగే సీరియల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తున్నాడు.

Also Read : మల్లి జీవితంలో కన్నీళ్లు తెప్పించే కష్టాలు.. ఎందుకిలా చేసింది..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×