E-Paper
Advertisement

Cat Crosses Path: పిల్లి ఎదురుగా వస్తే.. వెనక్కి వెళ్లిపోతాం ఎందుకు? దాని వెనుక సీక్రెట్ అదే

Cat Crosses Path: పిల్లి ఎదురుగా వస్తే.. వెనక్కి వెళ్లిపోతాం ఎందుకు? దాని వెనుక సీక్రెట్ అదే
Advertisement

Cat Crosses Path: ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇల్లాలిని ఎదురు రమ్మని చెబుతున్నారు. గృహిణి ఎదురుగా వస్తే బయటకు వెళ్లిన వ్యక్తికి పనులు జరుగుతాయన్నది బలమైన నమ్మకం. అదే సమయంలో పిల్లి ఎదురుగా వస్తే, ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఈ నమ్మకం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

పిల్లి ఎదురుగా వస్తే.. వెనక్కి ఎందుకు పోతారు? దేశంలో పురాతన నమ్మకం నేటికీ కొనసాగుతోంది.  బయటకు లేదా ప్రయాణాలు వెళ్లేటప్పుడు ఎదురుగా పిల్లి ఎదురు వచ్చినా, ఎడమ నుంచి కుడి వైపు వచ్చినా వాయిదా వేసుకుంటారు చాలామంది. నిత్యం కోట్లాది మందిని ప్రభావితం చేస్తోన్న ఈ నమ్మకం వెనుక అసలు గుట్టు ఏంటి? పిల్లులు దురదృష్టాన్ని తెస్తాయని నమ్మకం దేశంలో లేదు.

Advertisement

ఐరోపా నుంచి వచ్చిన కాన్సెప్ట్-మధ్య ఐరోపాకు చెందిన కాన్సెప్ట్. అక్కడ పిల్లులు లేదా నల్ల పిల్లులను క్షుద్ర విద్యతో ముడిపెట్టేవారు మంత్రగత్తెలు. రాత్రి వేళ ఎవరికీ కనపడకుండా తిరగడానికి పిల్లులు రూపాంతరం చెందుతాయని అప్పట్లో బలంగా  నమ్మేశారు.  వలసవాదం, సాంస్కృతిక మార్పిడి జరిగినప్పుడు మూఢనమ్మకాలు భారతీయ సమాజంలోకి చొచ్చుకుపోయాయి. తర్వాత రోజుల్లో శకునాలు, జ్యోతిష్యాల నమ్మకాలతో కలిసిపోయాయి.

పిల్లులు చెడ్డవని చెప్పే కంటే సమయం, వెళ్తున్న ప్రాంతం, దిశకు సంబంధించినది చెబుతారు. ప్రయాణం  ప్రారంభించే క్షణంలోనే ఫలితాన్ని నిర్ణయిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. అందుకే పిల్లి ఎదురైనపుడు అంతరాయంగా భావిస్తారు. చాలామంది కాసేపు ఆగి ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభిస్తుంటారు. చాలా మంది వాయిదా వేసుకుంటారు. మరో శుభ ముహూర్తం చూసుకుని అప్పుడు ఆ  పని ప్రారంభిస్తారు. ఇదంతా యూరోపియన్ వెర్షన్.

Advertisement

ఆసియా ప్రజలు మాటేంటి?ఇక ఆసియా ప్రజల మాటేంటి? ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు  పిల్లి ఎదురైతే అదృష్టాన్ని కలిగిస్తుందని జపాన్ వాసులు బలంగా నమ్ముతారు. జపాన్‌లో మన దారికి పిల్లి అడ్డంగా వచ్చిందంటే  మంచి జరుగుతుందని అర్థం. పిల్లి ఎదురైనప్పుడు సంపద లేదా కొత్త అతిథి వస్తారని స్కాట్లాండ్‌ ప్రజల నమ్మకం. ఈజిప్టులో పిల్లలను రక్షణ, సంతానోత్పత్తి, ఆనందానికి ప్రతీక అని నమ్ముతారు. దేవతతో ముడిపడిన  పవిత్ర జీవులుగా పూజించేవారు. పిల్లిని పెంచడం ఆశీస్సులను తెస్తుందని నమ్మేవారూ లేకపోలేదు.

ALSO READ: సముద్రంలోకి అంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే!

మనుషుల వాసనబట్టి పెంపుడు జంతువులు మెలుగుతుంటాయి. ఆకలితో ఉన్నపుడు మాత్రమే అరుస్తాయని, ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉంటాయి. చీకటిలో శబ్దం లేకుండా కదలడం వల్ల భయం ఏర్పడింది. ఇక నలుపు పిల్లులను చూస్తే చాలామంది భయపడతారు. అంతే తప్ప పైన చెప్పిన వాటిలో ఎలాంటి రుజువులు లేవు. మరో విషయం ఏంటంటే పురాణాల్లో జంతువులను దేవతల వాహనాలుగా చెబుతారు. పిల్లులు మూఢనమ్మకాల గురించి తెలియకుండా తమ సహజ ప్రవృత్తితో అనుసరించే జంతువులు. ఆధ్యాత్మికత, మూఢనమ్మకాలు కలిగిన మన దేశంలో ఇలాంటి నమ్మకాలు సహజం. మన విజయాలపై ఎలాంటి ప్రభావం చూపవు.

సూచన- చెప్పిన వివరాలు కొందరు వ్యక్తులు, పుస్తకాల్లో ఆధారంగా అందించినవి. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. వీటిని ఎంతవరకు నమ్మవచ్చు అనేది మీ వ్యక్తిగత విషయం. దయచేసి గమనించగలరు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×