E-Paper
Advertisement

Vijay Karthik-Keerthy Bhatt:డబ్బులు లేవనే బ్రేకప్.. కీర్తి బాగోతం బయట పెట్టిన విజయ్ కార్తీక్!

Vijay Karthik-Keerthy Bhatt:డబ్బులు లేవనే బ్రేకప్.. కీర్తి బాగోతం బయట పెట్టిన విజయ్ కార్తీక్!
Advertisement

Vijay Karthik-Keerthy Bhatt: బుల్లితెర సీరియల్స్ ద్వారా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి భట్(Keerthy Bhatt) తన జీవితానికి సంబంధించి సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఈమె నటుడు విజయ్ కార్తీక్ (Vijay Karthik)నుంచి విడిపోతున్న విషయాన్ని తెలియచేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కీర్తి భట్ పెద్దల సమక్షంలో నటుడు విజయ్ కార్తీక్ తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ ఏడాదిలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వీరిద్దరూ తమ నిశ్చితార్థం రద్దు చేసుకొని విడిపోయారు. ఇలా వీరి బ్రేకప్ కి సంబంధించిన విషయాన్ని కీర్తి అధికారికంగా ప్రకటించింది.

కీర్తికి బ్రేకప్ చెప్పొద్దు…

నిశ్చితార్థం జరిగిన ఏడాది తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడంతో ఈ బ్రేకప్ వెనుక గల కారణం ఏంటి అనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కీర్తి భట్ ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారనే విషయం గురించి నటుడు విజయ్ కార్తీక్ స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా విజయ్ కార్తీక్ మాట్లాడుతూ.. కీర్తి బ్రేకప్ గురించి పోస్ట్ చేసిన తర్వాత తనకు ఫ్రెండ్స్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని తెలిపారు. దయచేసి కీర్తిని వదిలి పెట్టుకోకు, తనకు బ్రేకప్ చెప్పొద్దు అంటూ చాలామంది మెసేజ్ చేశారని తెలిపారు. అయితే తాను కీర్తికి బ్రేకప్ చెప్పలేదని ఆమె నన్ను వదులుకొని వెళ్లిపోయిందని క్లారిటీ ఇచ్చారు.

వేరొకరితో రిలేషన్ లో కీర్తి భట్..

Advertisement

ఈ విషయాన్నీ కీర్తి గత డిసెంబర్ లోనే నా దగ్గర చెప్పింది అయితే తనకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేశా కానీ ఆమె వినలేదని తెలిపారు.. ఇక కీర్తి తనకు బ్రేకప్ చెప్పడానికి కారణం ఫైనాన్షియల్ గా తాను సెటిల్ కాకపోవడమే కారణమని విజయ్ తెలిపారు. లైఫ్ లో తాను ప్రతి ఒక్కదానికి కాంప్రమైజ్ అయ్యి బ్రతకలేనని, అందుకే విడిపోదామంటూ తాను చెప్పిందని, ఈ విషయంలో నేను మా ఫ్యామిలీ తనకు ఎంత సర్ది చెప్పినా వినని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కీర్తి నాకంటే ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అయిన వారితో ట్రావెల్ చేస్తోందని, ఆ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపినట్టు విజయ్ కార్తీక్ వెల్లడించారు.

?igsh=dnBiZWd1eXIyYjMz

Advertisement

ఇలా మేమిద్దరం విడిపోవడానికి ఇదే కారణం , దయచేసి ఈ విషయాన్ని మరొక రూపంలో ప్రచారం చేయొద్దని తెలిపారు. ఎక్కడున్నా వారిద్దరూ సంతోషంగా ఉండాలని విజయ్ కార్తీక్ కోరుకున్నారు. కీర్తి తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు గడపాలనుకున్నారు అడ్డుచెప్పే హక్కు నాకు లేదని విజయ్ కార్తీక్ బ్రేకప్ కు సంబంధించి వివరణ ఇవ్వడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈయన ఈ వీడియోని విడుదల చేయడంతో తప్పు మొత్తం కీర్తిదేనని భావిస్తూ.. నెటిజెన్స్ మీరు చాలా లక్కీ.. స్ట్రాంగ్ గా ఉండండి అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Also Read; Jr.NTR: జూ.ఎన్టీఆర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఆ పేర్లకు అనుమతి తప్పనిసరంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×