E-Paper
Advertisement

Neerus Showroom Seized: రంగనాథ్ యాక్షన్.. బంజారా హిల్స్ లో నీరూస్ షోరూమ్ సీజ్..!

Neerus Showroom Seized: రంగనాథ్ యాక్షన్.. బంజారా హిల్స్ లో నీరూస్ షోరూమ్ సీజ్..!
Advertisement

Neerus Showroom Seized: న‌గ‌రంలో షాపుల‌తో పాటు వాణిజ్య స‌ముదాయాల్లో హైడ్రా త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 36లో ఉన్న నీరూస్ షోరూంను గురువారం త‌నిఖీ చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంత‌స్తుల‌కు తోడు.. పైన అనుమ‌తి లేని రూఫ్ షెడ్డు వేసి వ‌స్త్రాల‌తో నింపేయ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. రెండు అంత‌స్తుల్లో అమ్మ‌కాలు, పైన మూడు అంత‌స్తుల్లో వ‌స్త్రాల త‌యారీ, గోదాములా పెద్ద‌మొత్తంలో నిలువ‌లు ఉంచ‌డంప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఫైర్ ఎన్వోసీ లేకుండా షాపుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు నిర్ధారించుకున్నారు. ఫైర్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోవ‌డ‌మే కాకుండా.. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ (మంట‌ల‌ను ఆర్పేది) లు కూడా స‌రిగా లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో సీజ్ చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. హైడ్రా, ఫైర్, జీహెచ్ ఎంసీ, విద్యుత్ శాఖ‌ల‌కు చెందిన అధికారులు ఈ త‌నిఖీల్లో ఉన్నారు. ఫైర్ అన్ సేఫ్ షాపుగా పేర్కంటూ బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. విద్యుత్ అధికారులు ప‌వ‌ర్ స‌ప్లైను బంద్ చేశారు.

Advertisement

నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డులో గ‌త శ‌నివారం బ‌చ్చాస్ ఫ‌ర్నీచ‌ర్ షోరూంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం.. ఐదుగురు మృతి చెందిన ఘ‌ట‌న త‌ర్వాత కూడా అదే రోడ్డులో ఉన్న దుకాణ దారులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు తీవ్రంగా ప‌రిగ‌ణించారు. నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డులో ర‌హీమ్‌, మ‌న్న‌న్ ఎస్టేట్స్ స్టాండ‌ర్డ్ ఫ‌ర్నీచ‌ర్ దుకాణం ఉన్న భ‌వ‌నం 6 అంత‌స్తులుండ‌గా.. సెల్లార్‌తో పాటు.. మొత్తం అన్ని అంత‌స్తుల్లో భారీగా ఫ‌ర్నీచ‌ర్ నిలువ‌లుంచ‌డం.. మెట్ల మార్గాన్ని కూడా మూసేసిన విధంగా స్టాక్ పెట్ట‌డం ప‌ట్ల హైడ్రా క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఫైర్ ఎన్‌వోసీ లేక‌పోవ‌డంతో పాటు.. 6 అంత‌స్తుల్లో ఎక్క‌డా ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్లు క‌నిపించ‌క‌పోవ‌డాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. మొత్తం 6 అంత‌స్తులు త‌నిఖీ చేసి.. ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు ఎక్క‌డా కాన‌రాక‌పోవ‌డంతో సీజ్ చేయాల‌ని ఆదేశించారు. ఈమేర‌కు హైడ్రా, జీహెచ్ ఎంసీ, ఫైర్ విభాగంతో పాటు విద్యుత్ శాఖ‌కు చెందిన అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. వెంట‌నే విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆపేశారు. ఆ భవ‌నంలో వ్యాపార లావాదేవీలు జ‌ర‌గ‌కుండా నిలిపేశారు.

Advertisement

ఫైర్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్టు ఎవ‌రైనా గ‌మ‌నిస్తే.. హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667 నంబ‌రుతో పాటు.. నేరుగా త‌న నంబ‌రు 7207923085 కు స‌మాచారం ఇవ్వాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను కోరారు. షాపులను గోదాముల‌గా మార్చేసి వారి వ్యాపార వ‌స్తువుల‌ను అందులోనే నిలువ‌లుంచ‌డం, సెల్లార్ల‌లో భారీ మొత్తంలో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ‌స్తువులు పెట్టిన‌ట్ల‌యితే సంబంధిత షాపు, వ్యాపార స‌ముదాయాల వివ‌రాల‌తో పాటు.. ఏ ప్రాంతంలో ఉన్న‌దీ స్ప‌ష్టంగా పేర్కంటూ వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపాల‌ని సూచించారు. Commissioner_HYDRAA పేరిట ఉన్న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లోనూ ఫిర్యాదు చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు.

ALSO READ: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటుతుందా…?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×