E-Paper
Advertisement

తల్లి కాబోతున్న బుల్లితెర నటి… బేబీ బంప్ ఫోటోలు వైరల్!

తల్లి కాబోతున్న బుల్లితెర నటి… బేబీ బంప్ ఫోటోలు వైరల్!
Advertisement

Tv Actress: బుల్లితెరపై నటిగా ఎక్కువ సీరియల్స్ కాకుండా చాలా తక్కువ సీరియల్స్ చేసినప్పటికీ ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు .అలాంటి వారిలో చందన శక్తి ఒకరు. ఈమెను చందన శెట్టి అంటే ఎవరు కనుక్కోలేరు కానీ వరూధిని పరిణయం (Varudhini Parinayam) సీరియల్ నటి అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తుకు వస్తారు. జీ తెలుగులో ప్రసారమైన వరూధిని పరిణయం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తదుపరి ఎలాంటి సీరియల్స్ లో కనిపించకపోవడం గమనార్హం. రవికృష్ణ (Ravi Krishna)చందన శెట్టి(Chandana Shetty) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సీరియల్ అప్పట్లో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

తల్లి కాబోతున్న చందన శెట్టి..

ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న చందన తదుపరి తెలుగులో ఎలాంటి సీరియల్స్ చేయలేదు .ఇక ఈమె కన్నడ నటి కావడంతో కన్నడలో పలు సీరియల్స్ అలాగే సినిమాలలో కూడా నటించారు. ఇక ఈమెతో పాటు ఈ సీరియల్ లో నటించిన రవి కృష్ణ ప్రస్తుతం సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కానీ చందన మాత్రం ఏకంగా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ విదేశాలలో స్థిరపడ్డారు. 2024లో తన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె విదేశాలలో స్థిరపడ్డారు.

బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన నటి..

Advertisement

తన భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఈమె కూడా అక్కడే సెటిల్ అవ్వటమే కాకుండా యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు . రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న చందన త్వరలోనే తల్లి కాబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన భర్త తనకు ప్రపోజ్ చేసిన ఫోటోతో పాటు ప్రస్తుతం తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ముద్దాడుతూ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఈమె తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఈ విధంగా చందన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు తోటి నటీనటులు ఈ పోస్ట్ చూసిన అనంతరం చందన దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక చందన కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఈమె తెలంగాణ ఇంటి కోడలు అడుగుపెట్టారు ఈమె భర్త పేరు అనిల్. ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత చందన కూడా యుఎస్ లో సెటిల్ అవుతూ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Also Read: రొమాంటిక్ సీన్స్ పై ఇంటింటి రామాయణం అవని కామెంట్స్…చాలా సీరియల్స్ మిస్ చేసుకున్నా అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×