E-Paper
Advertisement

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?
Advertisement

Vahan Portal: స్వేచ్ఛ బ్యూరో: భారత ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (నిక్) అభివృద్ధి చేసిన వాహన్ పోర్టల్‌ను రాష్ట్రవ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను సరళీకృతం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి అమలు చేస్తోందని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి, ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వాహన్ అమలు దశలవారీగా (ఫేజ్‌లవారీగా), మాడ్యూల్ వారీగా కొనసాగుతోందన్నారు.

ఫ్యాన్సీ నంబర్..

వాహన్ తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) విజయవంతంగా జారీ అవుతున్నాయని, సంబంధిత మాడ్యూల్ స్థిరీకరించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,200 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్లు జారీ చేయబడ్డాయి. అదే విధంగా ఫ్యాన్సీ నంబర్ (ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్) మాడ్యూల్ ను సైతం ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు మొత్తం 858 వేలంపాటలు పారదర్శకంగా, సమర్ధవంతంగా విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

Advertisement

Also Read: బీజేపీలో బినామీల రాకీయం.. రచ్చకెక్కిన పైసల పంచాయతీ.. వారికి వేటుతప్పదా..?

రాబోయే 15 రోజుల్లో..

వాహన్ పోర్టల్ ప్రస్తుతం నిక్ బృందం నిరంతర సాంకేతిక సహకారంతో దశలవారీగా స్థిరీకరించబడుతోందని తెలిపారు. అదనపు మాడ్యూల్స్‌ను కూడా దశలవారీగా అమలు చేస్తున్నారని, రాబోయే 15 రోజుల్లో ఈ వ్యవస్థ పూర్తిగా స్థిరపడుతుందని, దీంతో అన్ని సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ మార్పు దశలో వాహన డీలర్లు, పౌరులు, ఇతర సంబంధిత వర్గాల సహకారాన్ని రవాణా శాఖ అభినందిస్తోందన్నారు. డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు సమర్థవంతమైన, పౌర కేంద్రిత సేవలను అందించడంపై రవాణా శాఖ కట్టుబడి ఉందని వెల్లడించారు.

Advertisement

Also Read: ఢిల్లీ హైకోర్టులో బన్నీకి భారీ ఊరట.. ఇకనైనా మార్పు వస్తుందా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×