E-Paper
Advertisement

హైదరాబాద్ లో 5 కోట్ల విలువైన విల్లా కొన్న వదినమ్మ సీరియల్ నటి సుజిత?

హైదరాబాద్ లో 5 కోట్ల విలువైన విల్లా కొన్న వదినమ్మ సీరియల్ నటి సుజిత?
Advertisement

Tv Actress Sujitha: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి అనంతరం నటిగా బుల్లితెరపై, వెండితెరపై కొనసాగుతున్న వారిలో నటి సుజిత (Sujitha)ఒకరు. చిరంజీవి హీరోగా నటించిన పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన ఈమె అనంతరం చిరంజీవి జై చిరంజీవ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా సంగతి తెలిసిందే. వదినమ్మ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజిత ప్రస్తుతం పలు సీరియల్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

హైదరాబాదులో 5 కోట్ల విల్లా..

సుజిత సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ పెద్ద ఎత్తున ఆస్తులను కూడా కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈమెకు చెన్నైలో ఖరీదైన ఆస్తులు ఉన్నాయని, హైదరాబాద్లో కూడా ఇటీవల ఐదు కోట్ల విలువ చేసే ఒక విల్లా కొనుగోలు చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. ఇలా విల్లా కొనుగోలు చేసినట్టు వస్తున్నటువంటి వార్తలపై సుజిత స్పందించారు. తాజాగా సుజిత శ్రీముఖి (Sreemukhi)యాంకర్ గా కొనసాగుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ (Aadivaram With starmaa Parivar) కార్యక్రమంలో పాల్గొన్నారు.

గృహప్రవేశానికి నేను కూడా వెళ్లలేదు..

Advertisement

ఈ కార్యక్రమంలో సుజితతో పాటు మరికొంతమంది బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వారి గురించి వచ్చిన రూమర్లపై స్పందించి అసలు నిజం చెప్పాలని శ్రీముఖి తెలిపారు. ఈ నేపథ్యంలోనే సుజిత హైదరాబాదులో ఐదు కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేశారు అంటూ వచ్చిన రూమర్ పై స్పందించారు. సుజిత ఐదు కోట్ల విలువైన ఇల్లు కొని కనీసం గృహప్రవేశానికి కూడా మమ్మల్ని పిలవలేదు అంటూ శ్రీముఖి మాట్లాడటంతో వెంటనే సుజిత స్పందిస్తూ నేను కూడా వెళ్లలేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

ఇలా సోషల్ మీడియాలో తాను ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కొన్నాను అంటూ వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని సుజిత ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ఇక సుజిత సుమారు 50కి పైగా సీరియల్స్ లో నటించారని చెప్పాలి. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఈమె సీరియల్స్ చేశారు తెలుగులో వదినమ్మ సీరియల్ తో పాటు సుందరాకాండ ,కలిసుందాం రా, కలవారి కోడలు, గంగోత్రి, ఏడడుగులు, స్వాతి చినుకులు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ,భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: సైలెంట్ అయిన పూరి స్లమ్ డాగ్.. విడుదల ఆలస్యానికి అదే కారణమా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×