E-Paper
Advertisement

పెళ్ళాం ఉండగానే పక్కచూపులు… చుక్కలు చూపించే బూచీ దెయ్యం

పెళ్ళాం ఉండగానే పక్కచూపులు… చుక్కలు చూపించే బూచీ దెయ్యం
Advertisement

Horror Thriller OTT : క్షుద్రపూజల నేపథ్యంతో సాగే ఒక పక్కా హారర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఇండొనేషియన్ సినిమాను చూడాల్సిందే. కేవలం దెయ్యాలతో భయపెట్టడమే కాకుండా, మనుషుల మధ్య ఉండే అసూయ, పగ ఎంత భయంకరంగా మారుతుందో ఇందులో చూపిస్తారు. ఒకే ఇంట్లో ఇద్దరు భార్యల మధ్య జరిగే గొడవలకు, ఈ చేతబడులు తోడైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది ఈ సినిమా కథ. మీరు గనుక భయంకరమైన సీన్లు, ట్విస్టులు ఉన్న హారర్ సినిమాలు ఇష్టపడే వారైతే, ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

డెడీ మెర్సీ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ సినిమాపేరు ‘సోసక్ కెటిగా’ (Sosok Ketiga). ఇది జూన్ 22, 2023న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇండోనేషియాలో చేసే ‘లింట్రిక్’ అనే ప్రమాదకరమైన క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ వింత ఏమిటంటే, షూటింగ్ సమయంలో సెట్స్‌లో నిజంగానే కొన్ని వింత సంఘటనలు జరిగాయని చిత్ర బృందం చెప్పింది. దీంతో ఈ సినిమా ఇండోనేషియాలో పెద్ద సంచలనం సృష్టించింది. 2023లో విడుదలైన హారర్ సినిమాల్లో అతి తక్కువ రోజుల్లోనే 10 లక్షల (1 Million) మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఘనత దీనికి దక్కింది. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి, దీనికి సీక్వెల్‌గా ‘సోసక్ కెటిగా: లింట్రిక్’ అనే మరో పార్ట్ ను 2025 లో తీశారు. అదికూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. ఇది ఒరిజినల్ ఇండోనేషియన్ భాషలో అందుబాటులో ఉంది. దీనికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఉన్నాయి. అయితే తెలుగులో అందుబాటులో లేదు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఆంటోని అనే వ్యక్తి నూరిని పెళ్లి చేసుకుంటాడు కానీ వాళ్లకి పిల్లలు పుట్టరు. దాంతో అతను తన భార్యకి ఫ్రెండ్ అయిన యుని అనే పిల్లను రెండో పెళ్లి చేసుకుంటాడు. నూరి పైకి ఒప్పుకున్నట్టు నటించినా, లోపల మాత్రం మంటతో రగిలిపోతుంటుంది. అటు యుని కూడా తక్కువదేం కాదు, ఆంటోనిని దక్కించుకోవడానికి ముందే కొన్ని చేతబడులు, తంత్రాలు చేసి వాడిని తన బుట్టలో వేసుకుంటుంది. అలా ఇద్దరు భార్యల మధ్య అసూయ, పగతో సంసారం మొదలవుతుంది. ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే.. యుని గర్భవతి అయినప్పటి నుండి ఆమెకు వింత వింత అనుభవాలు ఎదురవుతాయి.

ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు, ఎవరో తనను చంపాలని చూస్తున్నట్టు భయం పట్టుకుంటుంది. కడుపులో ఉన్న బిడ్డకు ఏదో అవుతుందని వణికిపోతుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది. తను నూరి జీవితాన్ని పాడు చేయడానికి ఏ మంత్రాలనైతే నమ్మిందో, ఇప్పుడు అవే శక్తులు తన మీదకు తిరిగి వస్తున్నాయని. ఇంట్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా దెయ్యాల భయం. ఇప్పుడు ఆ ఆత్మ వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి పగ పడుతుంది. క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. అసలు ఆ దెయ్యం ఎవరు? యుని చేసిన తప్పుల వల్ల ఆ గతి పట్టిందా ? నూరి కక్ష తీర్చుకోవడానికి ఏమైనా చేసిందా ? అనేదే క్లైమాక్స్. మొత్తం మీద ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే మొగుడు, వాళ్ల మధ్య తిరిగే దెయ్యం చుట్టూ ఈ సినిమా తెగ భయపెడుతుంది.

Advertisement

Read Also : కోట్లు కొల్లగొట్టే ప్లాన్.. నవ్విస్తూనే గజగజ వణికించే యాక్షన్… మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×