E-Paper
Advertisement

ఇంట్లో టీవీ సీరియల్ నటి శవం.. భర్తే అలా చేశాడా? అసలు ఏమైంది?

ఇంట్లో టీవీ సీరియల్ నటి శవం.. భర్తే అలా చేశాడా? అసలు ఏమైంది?
Advertisement

Tv Actress: ఇటీవల కాలంలో పలువురు బుల్లితెర నటీనటుల మరణం ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కొంతమంది క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. తాజాగా బుల్లితెర నటి సుభాషిని సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు . చెన్నైలోనే తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.చెన్నై నగరంలోని పోరూరులో ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఈమె ఉదయం తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం.

భర్తతో వీడియో కాల్..

తన భర్తతో సుభాషిని వీడియో కాల్ చేసిన సమయంలో తనతో కొంత పాటి వాగ్వాదం జరిగిందని ఇలా కుటుంబ కలహాల నేపథ్యంలోనే సుభాషిని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈమె మరణించారనే విషయం వెలుగులోకి రావడంతో తోటి నటీనటులతో పాటు అభిమానులు కూడా షాక్ అవుతూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈమె మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసుల కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కాయల్ అనే టీవీ సీరియల్ తో గుర్తింపు..

Advertisement

ఇక సుభాషిని సుబ్రమణ్యం కెరియర్ విషయానికి వస్తే ఈమె 2012లో ‘ఇని అవన్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో ప్రసారమైన కాయల్ అనే టీవీ సీరియల్ ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. బుల్లితెర సీరియల్స్ లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ లక్షల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పరంగా పెద్ద బిజీగా గడుపుతున్న సుభాషిని ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని మరణించడం ఇండస్ట్రీకి కూడా తీరని లోటు అని చెప్పాలి. ఇక ఈమె మరణ వార్త విన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

శ్రీలంక మూలాలు కలిగిన సుభాషిని…

Advertisement

ఇక సుభాషిని గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 21వ తారీఖున ఈమె తన రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనున్నారు. అలాగే ఏప్రిల్ 12వ తేదీ ఈమె పుట్టినరోజు కావటం విశేషం. ఇలా పెళ్లయిన రెండు సంవత్సరాలకి ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది. శ్రీలంక మూలాలకు చెందిన ఈమె పిప్పిన్‌ అనే వ్యక్తిని రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. అయితే ఈమె కెరియర్ రీత్యా బెంగళూరు నుంచి చెన్నై వచ్చి అయ్యప్పంతంగల్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈమె అపార్ట్మెంట్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Also Read: ఖరీదైన లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన సింగర్ శ్రేయ ఘోషల్… ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×