E-Paper
Advertisement

బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ To విటారా ఫేస్‌ లిఫ్ట్.. మారుతి నుంచి 4 క్రేజీ కార్లు!

బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ To విటారా ఫేస్‌ లిఫ్ట్.. మారుతి నుంచి 4 క్రేజీ కార్లు!
Advertisement

Upcoming Maruti Cars 2026: ఇండియన్ కారు మార్కెట్ లో మారుతి సుజుకి మరింత సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది నాలుగు కొత్త మోడల్స్ ను లాంచ్ చేయబోతోంది. ఇటీవల విడుదలైన ఇ-విటారా తర్వాత, కంపెనీ ఇంకొన్ని కొత్త మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదిలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఏడాది మారుతి సుజుకి విడుదల చేయబోయే క్రేజీ కార్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿  బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్

మారుతి సుజుకి తన ప్రముఖ కాంపాక్ట్ SUV అయిన బ్రెజ్జాకు ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ ను తీసుకురానుంది. ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఈ మోడల్‌ కు ఇప్పుడు మరింత  క్రేజీ లుక్ ఇవ్వాలని మారుతి ప్లాన్ చేస్తోంది. కొత్త బంపర్లు, అప్‌డేటెడ్ గ్రిల్, మెరుగైన LED లైటింగ్ లాంటి మార్పులతో ఇది మరింత మోడర్న్‌ గా కనిపించనుంది. అంతేకాకుండా, ఈసారి పనోరమిక్ సన్‌ రూఫ్, పెద్ద టచ్‌ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లను కూడా యాడ్ చేసే అవకాశం ఉంది.

⦿ వాగన్ ఆర్‌ అప్ డేటెడ్ వెర్షన్

Advertisement

అటు వాగన్ ఆర్‌ కు మరో అప్‌ డేట్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇది పూర్తిగా కొత్త మోడల్ కాకపోయినా, డిజైన్‌ లో చిన్న మార్పులు, కొత్త కలర్స్, టెక్నాలజీ పరంగా కొన్ని అప్‌ గ్రేడ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా USB టైప్ C పోర్టులు లాంటి సౌకర్యాలు చేరవచ్చు. CNG వేరియంట్‌ లో బూట్ స్పేస్‌ ను పెంచడానికి కొత్త అండర్‌ బాడీ ట్యాంక్‌ ను కూడా తీసుకురావచ్చు.

⦿ ఫస్ట్ ఎలక్ట్రిక్ MPV

మరోవైపు మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ MPVని కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ‘YMC’ అనే కోడ్‌ నేమ్‌ తో పిలిచే ఈ మోడల్, పండుగ సీజన్ సమయానికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇ-విటారా ప్లాట్‌ ఫారమ్‌ పైనే నిర్మించబడుతుందని తెలుస్తోంది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో ఈ వాహనం అందుబాటులో రావచ్చు. ఒకటి సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే, మరొకటి దాదాపు 500 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని అంచనా.

⦿ గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్

Advertisement

మారుతి సుజుకి నుంచి మరో అప్ డేట్ గ్రాండ్ విటారాకు సంబంధించింది. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మోడల్‌కు కూడా ఫేస్‌ లిఫ్ట్ తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. కొత్త డిజైన్ ఎలిమెంట్స్, పెద్ద అలాయ్ వీల్స్, అడ్వాన్స్‌ డ్ సేఫ్టీ ఫీచర్లు,  మెరుగైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్‌డేట్స్ ఇందులో ఉండవచ్చు. అయితే ఇంజిన్, ట్రాన్స్‌ మిషన్‌ లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Read Also: ఎండలో కారు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×