E-Paper
Advertisement

Actress Kavya: ఫస్ట్ టైమ్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న నటి కావ్య.. అసలు ఏమైంది?

Actress Kavya: ఫస్ట్ టైమ్ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న నటి కావ్య.. అసలు ఏమైంది?
Advertisement

Actress Kavya:  బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంతో మంచిది గుర్తింపు సంపాదించుకున్న వారిలో కావ్య(Kavya) ఒకరు. గోరింటాకు చిన్ని వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట డాన్స్ షో(Aata Dance Show) కార్యక్రమంలో భాగంగా ఈమె మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాతగా కొనసాగుతున్న ఈ డాన్స్ షో కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఎలిమినేషన్ లో కావ్య ఎమోషనల్..

రఘు మాస్టర్ తో పాటు సీనియర్ నటి రాధిక నిహారిక కొణదెల జడ్జస్ గా  వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి శని ఆదివారాలలో ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా కావ్య తన టీమ్ నుంచి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తన టీమ్ మెంబర్స్ ను ఎలిమినేట్ చేయలేక ఈమె ఎంతో ఇబ్బంది పడ్డారు. తన టీం నుంచి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం చాలా బాధగా ఉందని నావల్ల కావడం లేదు జడ్జెస్ ఎవరైనా వారిని ఎలిమినేట్ చేయండి అంటూ ఎమోషనల్ అయ్యారు.

బిట్టును ఎలిమినేట్ చేసిన కావ్య..

Advertisement

ఇలా కావ్య తనకంటేస్టంట్ లను ఎలిమినేట్ చేయలేను అంటూ కన్నీళ్లు పెట్టుకోగా జడ్జెస్ మాత్రం తనని ఎలిమినేట్ చేయాలని చెప్పారు. దీంతో కావ్య తప్పనిసరి పరిస్థితిలలో తన టీంలో ఒకరైన బిట్టు అనే కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పూర్తి కార్యక్రమంలో భాగంగా కావ్య బిట్టు గురించి ఏం చెప్పారు.. ఏంటి అని వివరాలు తెలియనున్నాయి. ఇక కావ్య ప్రస్తుతం ఒకవైపు సీరియల్స్ లో చేస్తూనే మరోవైపు బుల్లి తెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్నారు. ఈమె కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Advertisement

ఇక కావ్య వ్యక్తిగత విషయానికి వస్తే ..ఈమె సీరియల్ నటుడు నికిల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ తమ లవ్ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా నిఖిల్ కావ్య బ్రేకప్ చెప్పుకోవడంతో ఎంతోమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు వీరిద్దరూ తిరిగి కలిస్తే బాగుంటుందని ఆశించారు. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా విడిపోయిన ఈజంట కెరీర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. నిఖిల్ బిగ్ బాస్ 8 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిఖిల్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు .

Also Read: Ustaad Bhagat Singh: తమిళంలో విడుదలకు సిద్ధమైన ఉస్తాద్ భగత్ సింగ్..ఎప్పుడంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×