E-Paper
Advertisement

Divvala Madhuri: తిరుమల వివాదం దివ్వెల మాధురి తనూజ పై కేసు నమోదు ..

Divvala Madhuri: తిరుమల వివాదం దివ్వెల మాధురి తనూజ పై కేసు నమోదు ..
Advertisement

Divvala Madhuri:  ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు యూట్యూబర్లు తిరుమల కొండపై చేస్తున్న వింత చేష్టల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం లైక్స్ వ్యూస్ పెంచుకోవడం కోసం లేదంటే సోషల్ మీడియా వార్తల్లో నిలవడం కోసం తిరుమల కొండపై నిషేధం అయినటువంటి చర్యలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న గీతు రాయల్ రీల్స్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే బిగ్ బాస్ తనూజ(Tanuja), దివ్వెల మాధురి(Divvala Madhuri) సైతం వివాదంలో నిలిచారు. తనూజ పుట్టిన రోజు సందర్భంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఈమె తిరుమల వెళ్లారు.

తిరుమల వివాదం తనూజకు షాక్..

ఇలా స్వామివారి దర్శనం అనంతరం మాధురి  తిరుమల కొండపై గెస్ట్ హౌస్ లో తనూజ బర్తడే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తిరుమల కొండపైకి కేక్ తీసుకు వెళ్లడం నిషేధం అయినప్పటికీ ఈమె కేక్ తీసుకెళ్లి తన చేత కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేశారు .అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో సంచలనగా మారటమే కాకుండా వీరిద్దరూ వివాదంలో చిక్కుకున్నారు. మాధురి తనూజ తిరుమల నిబంధనలను ఉల్లంగించారని, కచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్యలకు ఆదేశించిన టిటిడి..

Advertisement

ఇలా భక్తుల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తనూజ మాధురిపై చర్యలకు సిద్ధమయ్యారు. తిరుమల నిబంధనలను అతిక్రమించడంతో తనూజ, మాధురి పై చర్యలు తీసుకోవాలి అంటూ టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఈ విషయంపై టిటిడి స్పందించడంతో వీరిద్దరూ చిక్కుల్లో పడ్డారని చెప్పాలి మరి తనూజ, మాధురి ఈ ఘటనపై స్పందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

గతంలో క్షమాపణలు చెప్పిన మాధురి..

Advertisement

ఇలా మాధురి తనూజ గురించి ఈ విధమైనటువంటి వివాదం చెలరేగినప్పటికీ వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే మాధురి తిరుమల వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఈమె ఇలాంటి వివాదంలో నిలిచారు ఆలయం ముందు రీల్స్ చేయటంతో అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఇక ఈ విషయంపై మాధురి స్పందించి గతంలో క్షమాపణలు తెలియజేశారు. ఇలా ఒకసారి తిరుమల విషయంలో వివాదంలో నిలిచి క్షమాపణలు చెప్పినప్పటికీ మళ్లీ కూడా మాధురి తిరుమల నిబంధనలను అతిక్రమించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి గురించి కేసు నమోదు కావడంతో ఇప్పటికైనా ఈ ఘటనపై స్పందిస్తూ తనూజ మాధురి వివరణ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×