E-Paper
Advertisement

Janaki Parinayam Vishnu : ‘జానకి పరిణయం ‘ విష్ణు జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Janaki Parinayam Vishnu : ‘జానకి పరిణయం ‘ విష్ణు జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Janaki Parinayam Vishnu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా.. స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ ను అందుకున్న కుంకుమపువ్వు, త్రినయని, జానకి కలకనలేదు వంటి సూపర్ హిట్ సీరియల్స్ ఎలా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. తన నటనతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్న విష్ణు ప్రియ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది. ఈమె గతంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో భాగంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను అనుభవించిన బాధలను ఆమె బయట పెట్టింది.. కన్నీళ్లు తెప్పించే ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

విష్ణు ప్రియా ఎమోషనల్ స్టోరీ..

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెతకు తగ్గట్లుగానే విష్ణుప్రియ చూడడానికి చిన్నగా ఉన్నా తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది.. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది.. ఈమె నటించిన సీరియల్స్ అన్ని సూపర్ హిట్ అవడంతో కెరీర్ సాఫిగా సాగింది. అయితే సీరియల్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నారు. ఇక ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి విష్ణు ప్రియ ఇంటర్వ్యూ వచ్చింది. అందులో భాగంగా ఆమె తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల పెద్దగా కట్నకానుకలు ఆస్తులు మాకు లేవు.. మా అమ్మ ఒక బ్యాంకులో స్వీపర్గా పనిచేసింది.. మా అమ్మ నాన్న ఇద్దరూ కష్టపడి మమ్మల్ని చూసుకున్నారు.. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న కూడా చనిపోయారు.. వాళ్ళిద్దరూ లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అని ఆమె ఎమోషనల్ అయ్యారు.. తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడిన రోజులను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విష్ణు ప్రియా మరోసారి వార్తల్లో నిలిచింది..

విష్ణు ప్రియా ఫస్ట్ రెమ్యూనరేషన్..?

Advertisement

నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అతి కష్టం మీద అడుగుపెట్టినట్లు విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది విష్ణు ప్రియ.. అయితే ఈమె ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఫస్ట్ సీరియల్ కి ఆమెకు ఒక రోజుకి 1500 తీసుకుందట.. ప్రస్తుతం ఒక్కరోజుకే రెమ్యూనరేషన్ 15 వేలకు పైనే అని చెప్పింది.. ఇప్పుడు ఈమె జానకి పరిణయం అనే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ సీరియల్ ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతుంది.. ఇక సోషల్ మీడియాలో విష్ణుప్రియ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×