E-Paper
Advertisement

Telugu Serials : కన్నడ హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?

Telugu Serials : కన్నడ హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?
Advertisement

Telugu Serials : తెలుగు సీరియల్స్లలో కన్నడ హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోనూ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఇక్కడ కూడా హీరోయిన్గా కొనసాగుతున్నారు.. ఇటీవల కాలంలో ఎక్కువ మంది హీరోయిన్లు రావడంతో నెటిజన్లు వాళ్ల గురించి తెలుసుకునేందుకు గూగుల్లో ఎక్కువగా వెతికిస్తున్నారు.. మరి వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ క్రేజీ హీరోయిన్ల రియల్ లైఫ్, భర్తల బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కన్నడ హీరోయిన్ల భర్తల బ్యాగ్రౌండ్ ఇదే..

జ్యోతి రాయ్..

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో హీరో కి తల్లి పాత్రలో నటించింది.. అయితే ఇప్పుడు నాజుగ్గా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కన్నడ చిత్ర దర్శకుడు సుకుమార్ పూర్వాజ్ ను పెళ్లి చేసుకుంది..

దీప్తి మన్నె…

Advertisement

కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్లలో నటించి తెలుగులోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దీప్తి మన్నె.. ఈమె జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. రోహన్ అనే బిజినెస్ మెన్ తో ప్రేమలో పడింది. ఇక ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నారు..

లావణ్య భరద్వాజ్..

తెలుగులో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమైన సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో హీరోయిన్ ప్రేమ పాత్రలో నటించిన లావణ్య భరద్వాజ్ కన్నడ నటి అన్న విషయం తెలిసిందే.. కన్నడ సీరియల్స్ ద్వారా పాపులాటిని సంపాదించుకున్న శశి హెగ్డే ను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

వర్ష హెచ్ కే..

Advertisement

స్టార్ మాలో ప్రసారం అయిన హిట్ సీరియల్ ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ వర్ష.. కన్నడ నటుడు కౌశిక్ నాయుడుని వివాహం చేసుకున్నారు..

మంజుల పరిటాల, కీర్తి కూడా తెలుగు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.. వీళ్ళిద్దరూ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో మంచి పాపులర్ తిని సొంతం చేసుకోవడంతో పాటుగా తెలుగు యాక్టర్స్ ని పెళ్లి చేసుకున్నారు.

Also Read : వీకెండ్ ఓటీటీలో చిత్రాల వినోదం.. కొత్త సినిమాల లిస్ట్ ఇదే..?

వీళ్ళతోపాటుగా మరికొంతమంది యాక్టర్స్ కన్నడ సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే తెలుగు కన్నడ సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోయిన్లు.. ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ లోను కన్నడ హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.. వీళ్ళకి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×