E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ మొదటి స్థానంలో ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఉన్న డిమాండ్ కూడా అంత ఇంత కాదు. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ అన్ని మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఏ సీరియల్ అయినా సరే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ ఛానల్ లో వచ్చే ప్రతి సీరియల్ కూడా మంచి స్టోరీ తో రావడంతో వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. సినిమాలకు విడుదలైన తర్వాత ఏ విధంగా అయితే బాక్సాఫీస్ రిజల్ట్స్ ఉంటాయో.. సీరియల్స్ కూడా ప్రతి వారం టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. మరి ఈ వారం ఏ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం vs ఇంటింటి రామాయణం..

స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 ముందు వరుసలో ఉంటుందన్న విషయం చెప్పనక్కర్లేదు.. గత కొన్ని రోజులుగా ప్రతి వారం ఈ సీరియల్ నే టాప్ లో కొనసాగుతుంది.. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్లో అనేక ట్విస్టులు రావడంతో జనాలు ఈ సీరియల్ చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో దీని రేటింగు టాప్లోకి రావడం విశేషం. రెండు వారాల క్రితం ఇంటింటి రామాయణం సీరియల్ నెంబర్ వన్ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ కార్తీక దీపం 2 సీరియల్ వచ్చేసింది.. ఎప్పటిలాగే ఇంటింటి రామాయణం సీరియల్ సెకండ్ ప్లేసులో కొనసాగుతుంది.. అయితే ఈవారం ఇంటింటి రామాయణం సీరియల్ టాప్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంది.. పల్లవి బండారం బయటపడితే మాత్రం శుభం కార్డు కూడా పడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి అవనికి అనుమానం.. దారుణంగా అవమానించిన ఫైనాన్షియర్.. పల్లవి అవుట్…

ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్..

స్టార్ మా ఛానెల్ ఎప్పుడు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటూ వస్తుంది.. ప్రతి వారంలాగే ఈ వారం స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికొస్తే.. కార్తీక దీపం 2 రేటింగ్ విషయానికొస్తే.. 14.53 గా ఉంది. ఇంటింటి రామాయణం రెండొవ స్థానంలో కొనసాగుతుంది. దీని రేటింగ్ విషయానికొస్తే.. 13.68 ఉంది. గుండెనిండా గుడిగంటలు 13.36, ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.45, పొదరిల్లు 11.26, నువ్వులేక నేను లేను 9.66, నిండు మనసులు 8.26, చిన్ని 7.42, బ్రహ్మముడి 7.29. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ ను నమోదు చేసుకున్నాయి. మరి పొదరిల్లు సీరియల్ ఇప్పుడు టాప్ లో కొనసాగుతుంది.. మరి వచ్చేవారం ఏ సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.. ఈ వారం నుంచి స్టార్ మాలో కొత్త సీరియల్ ప్రసారం అవుతున్నాయి.. ఏ సీరియల్ టాప్ లోకి వస్తుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×